Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
28
ఉ|| సప్తమమైన మేషమునఁ జంద్రయుతుండయి యుండె రాహు. వి

ప్డాప్తము తన్మహాదశయె. ఆదశయాదిని గల్గె విత్తసం

ప్రాప్తి గయాప్రయాగగమనాదిశుభంబులు. కాని దీర్ఘసం

సుప్తినిజెందెఁ దొంటిసతి. శోకము చిత్తముఁ జిందె భాస్కారా!

చం|| స్థితుఁడు కళత్రమం దతఁడు. చేసెను జేయఁగఁదగ్గ కార్యము౯

ద్రుతముగ వెండి పెండిలియుఁ దోడనె పెండిలియాడఁబడ్డ యా

పతిరతయందు సంతతియుఁ బంటవలంతియుఁ గూర్చెఁ గాని యీ

స్థితి స్వదాశావసానమునఁ జేకురఁజేసె నదేమొ భాస్కరా! ౧౯౦

ఉ|| నిర్దయుఁడై విధుంతుదుఁడు నిన్నె గ్రసించుచునుండుఁగాన నా

దుర్దముమా టటుంచుము చతుర్థనిజాలయవ ర్తియయ్యు సౌ

హార్దముఁజూపఁడయ్యె భవదాత్మజుఁడౌ నసితుండు. వాని యం

తర్దశయే మదార్థికమున౯ విషమించె నొకింత భాస్కరా! ౧౯౧

మ|| అలరాహుండు కళత్రవర్తియగుట౯ స్వాంతర్దశావేళలో

సలిపెం దాను గళత్రమారణ. మిఁకేసంతాపముంగూడఁదా

కలిగింపం. డటుపైఁ ద్రిషష్ఠపతియై కన్య్౯ వ్యయంబందె వ

ర్తిలియు౯ గీష్పతి మేలెచెసిచనె. తద్ధీఁజూడు మోభాస్కరా!

ఉ|| వచ్చె భవత్సుతుండు నటుపైని. సుతాధిపుఁడౌటఁజేసి తా

ఇచ్చె సుతు౯ . నుతింపవలె నిందుల కాతని. కాని యెంతయున్

హెచ్చు మదార్ధికంబునకు నించుక మాంద్యము తెచ్చిపెట్టెఁబో

ఇచ్చపడెన్ స్వమాంద్యమునె యెల్లెడ నుంచ నతండు భాస్కరా!

మ|| అదియేమాంద్య మిఁకింతహెచ్చినది సౌమ్యాంతర్దశన్. తద్బుధుం

డదయుం డయ్యెను భాగ్యనాథుఁడయి రాజ్యంబందు విత్తేశు తో

డొదవన్ వర్తిలికూడ. లాభపతి వీవున్నాఁడ వచ్చోట సం

పద నిప్పింపఁగలేకపోతి హితుచే. భావ్యంబొకో భాస్కరా!

మ|| ధనలాభేశులతోడ రాజ్యగతుఁడౌ తత్సౌమ్యుఁడే యంతగా

ధనముం గూర్పకయుండఁ గేతువె యిఁకందాఁగూర్చువాఁ డాతఁడు

దనుభావస్థుఁడు. దానఁజేసి తనువే తద్దృష్టులన్ మున్ బడెన్.

తనుసౌఖ్యంబు హరించె. వేఁకిమొలకన్ స్థాపించెఁబో భాస్కరా!