పుట:AarogyaBhaskaramu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
20
ఉ|| ఒక్క బలప్రదానమున నూఱడిలం జుమి నేను. ఎక్కుడౌ

పిక్కబలంబులేక యిఁక భీమబలంబును బొందిమాత్ర మే

అక్కఱఁదీర్పఁగాఁగలను. అందునఁ బిక్కపిఱుందులందుఁ బెం

పెక్కుచునున్న లాగుడు క్షయింపవలెం బ్రథమంబు భాస్కరా!

ఉ|| పిక్కపిఱుందులందుఁగల పీఁకుడుపోకకుఁగూడఁ దానె యీఁ

డొక్కొ ప్రసాదరావు కృప నుత్తమభేషజముల్. ఫలింపదా

ఉక్కలుయత్న మింతవఱ కోజ శరీరబలంబొసంగి ము౯

తక్కటి పిక్కచక్కిరహిఁ దార్కొన నుండె నతండు భాస్కరా!

ఉ|| పిక్కబలంబె ప్రస్తుతము పేరునకేనియు లేదుకాని నా

తక్కుశరీరము దలఁతి దార్ఢ్యముగల్గెను. దానఁజెసియే

ఎక్కుడుభక్తి నిన్ను నుతియించుచు నల్లిన పద్దియంబు లి

ట్లొక్కెడఁగూరుచుండి కర మోపిక వ్రాయుచునుంటి భాస్కరా!

ఉ|| యుష్మదనుగ్రహంబుమెయి నుండవలె౯ బల మింత కాని యా

ముష్మికమో యిఁ కైహికమొ పూని లిఖింపక యూరకున్నె య

ర్చిష్మదదకరాంబుజము. చిత్తము కాల్పనికత్వపుంగ్రియ౯

భీష్మజనన్యమోఘఝరిపెల్లునఁ బోవకయున్నె భాస్కరా! ౧౩౬

మ|| క్రియమాణంబులు కూరుచుండి యొకచోఁ గేల్దోయిచేఁ జేయు న

య్యయిచైదంబులు. కాని తక్కుఁగల యయ్యంఘ్రిద్వయిం జేయనౌ

వయనంబాది సమస్త కార్యములునుం బాడయ్యెడిం గావున౯

దయమానుండవు నీవు కావలయుఁ దత్సంసిద్ధికి౯ భాస్కరా!

శా|| కాలుం జేయియు నాడునంతవఱ కీకల్యాణిఁ బోషింతునం

చాలోచింఅక పత్రికావిషయమం దన్నాఁడ మున్నేను. నా

కేలే యాడెడిఁగాని కాలి కకటా! కీడ్పాటు వాటిల్లె. ఇం

కేలా పత్రికనడ్పుదు౯ ? ప్రతిన యిం కెట్లేలుదు౯ భాస్కరా!

చ|| రథకృ దధఃకృ దుద్ధురతరవ్యవహారుఁడ నైనయప్పుడు౯

వృథులతరజ్వరాదిపరిపీడితకాయుఁడ నైనయప్పుడు౯

ప్రథమకళత్రపుత్రు లిలఁబాసి దివంగతులైనయప్పుడు౯

శిథిలతలేని పత్రికకుఁ జేటొనగూర్చెదె నేఁడు భాస్కరా! ౧౩౯