పుట:AarogyaBhaskaramu.djvu/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
18
ఉ|| ఊరిచి యూరడించి తనయోకమునందె ప్రవేశపెట్టి పె

ల్లోరిమి స్నానపానశయనోదనముఖ్య సుఖోపచారముల్

దారసుతానుజాదికుల ద్వారమున౯ జరిపించు చోషధీ

సార మిడం గడంగె ధుతసారుఁడనైమను నాకు భాస్కరా!

మ|| అగదంకారజనప్రకాండుఁ డితఁడే యౌనాఁ బురాణజ్వరం

బు గుదిర్చె౯ మొద లద్ది నాదుమెయిలో మూఁడేండ్ల నాఁడే భృశం

బుగఁ దాఁ జొచ్చి వసించుచున్నయది. ఎప్డు౯ వీడిపోఁజూడ కా

కుగదం బెంతయు నేఁచుచున్నయది న౯ గూఢంబుగా భాస్కరా!

ఉ|| గూఢముగాఁగ నుంచు మెయిఁ గొన్నిదినంబులు పైకివచ్చి న౯

గాఢముగానె యేఁచెడిని. కళ్ళ విశేషము వెళ్ళుటాదిగా

రూఢములౌచువర్తిలెడి రోగములన్నియు దానిభృత్యు. లే

మూఢత నప్డె పోయెనని బుద్ధిఁ దలంచుచునుంటి భాస్కరా!

శాం|| పిక్కం దుంటి సతంబుఁ జేడ్పఱచు నా పెంవ్యాధికంటెం గడు౯

ప్రాక్కాలీనమె యీజ్వరంబనియు నీరక్షస్సె మూలంబు తా

దృక్క్రూరామయరాజిరాక కనియుం దెల్లంబుగం దెల్పి ముం

దక్కుల్యుండు తదత్యయంబు సలిపె౯ యత్నంబున౯ భాస్కరా!

చ|| ఇరువదియేండ్లవాఁడనయి యే మనుచుండిననాఁటినుండియు౯

పరఁగెడిమూత్రదోషము క్రమంబుగ న౯ బలహీనుఁజేసె. ప

ల్మఱును బలంబురాకకయి మందులు తింటినిగాని యవ్వియ

త్తఱి బలకారులయ్యును బదంపడి వ్యర్థములయ్యె భాస్కరా!

మ|| చెలువౌ గాత్రమునందు వర్తిలు రసాసృజ్మాంసమేదోస్థిమ

జ్జలును౯ శుక్రము సప్తధాతువులు. తత్సారంబె యోజస్సు. త

జ్జ్వలదోజస్సె కతంబు దేహబలసంప్రాప్తిన్. తదోజస్సు ని

చ్చలు మూత్రంబునఁ బో బలంబిడునె భైషజ్యంబు లోభాస్కరా!

శా|| ప్రస్తావంబున సప్తధాతువుల సారంబైన యోజస్సిఁకా

జస్తంబుం జనకుండ నిల్పఁగల భైషజ్యంబె భక్షింపనౌ

విస్రంభంబున నట్లుచెసినపుడే వేగ౯ బలం బబ్బు. లే

కస్రుల్ గార్చును నెంతయేడిచినను౯ వ్యర్థంబెకా భాస్కరా!