పుట:AarogyaBhaskaramu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
6
ఉ|| నల్వదివత్సరంబులక నాదుశరీరమునందు ర క్తపు౯

కాల్వలవేగ మాఁగుటయుఁ గన్గవ నిద్దపు టద్దపుంగవ౯

చెల్వునుగాంచె. కాని నడునెత్తి వికేశము. తక్కునౌదల౯

మొల్వదు నల్లవెండ్రుకయు. మోము వివర్ణ. మిఁకేమి భాస్కరా!

ఉ|| దంతము లొక్కడొక్కటి పదంపడి యూడఁగఁజొచ్చె. కాళ్ళతీఁ

పెంతయు నేర్పడె౯. బలవిహీనుఁడనైతిని. దానఁజేసి ర

వ్వంతపనిం బొనర్చుటక యంగము లోపకపోయె. ఇట్లు బల్

వింతగ సప్డ నేను శతవృద్ధుగఁ దోఁచితిఁగాదె భాస్కరా! ౩౬

ఉ|| దంశనపాతముఖ్యమగు తత్థ్సవిరత్వపుఁ జిన్నెలన్నియు౯

వింశతిహాయనప్రభృతి వేమఱు మూత్రములోనఁబోవు ధా

త్వంశమునుండి యేర్పడియె నంచు వచించె నొకం. డతండు తా

భ్రంశ మొకింతలేని మతిపాటవమున్న భిషక్కు భాస్కరా! ౩౭

ఉ|| బందరువాస మాయనది. పండితుఁడుం గవితామతల్లుకి౯

విందును నైన చెళ్ళపిళ వేంకటశాస్త్రులుగారి శిష్యుఁ డా

నంది. కనిప్రియుండు. కరుణం గని యార్తుల దుర్నివార్యపు౯

క్రందులె పాపు. శేషగిరిరావని పిల్చు జనంబు భాస్కరా! ౩౮

ఉ|| శ్రీలఁదలిర్చు బందరుపురిం గయిసేయుదుఁ బేర్మిమైని హై

స్కూలునఁ బండితుండుగను శోభిలు వేంకటశాస్త్రిగారిని౯

బాళి భజించిరా నరునుపట్టల నాగిరిరావుతోడుత౯

చాలినయంత సౌహృదము నాకు ఘటిల్లెఁగదయ్య భాస్కరా!

చం|| బలమఱి ప్రాప్తవార్ధకుని భంగిఁ గనంబడుచున్నయట్టినా

నలువదియొక్కవత్సరమున౯ మఱి బందరుఁ బోఁ దటస్థమై

తెలిపితి నాదు దుస్థ్సితిని దెల్లముగా గిరిరావుతోడుత౯.

సలిపెను దచ్చికిత్సకుఁడు చయ్యన మూత్రపరీక్ష భాస్కరా!

ఉ|| ఇర్వదియేండ్లనుండియును నేగెడి సారము దాననుండి న౯

పర్వఁగనున్న నంజురుజ బాగుగఁ దోఁచెను రుక్ప్తతిక్రియా

ధూర్వహుఁడైన యాయనకుఁ. దోడన స్నేహితుఁడౌటఁదద్రుజా

గర్వమడంచు మందు నిడె. కైకొని తింటినినేను భాస్కరా! ౪౧