పుట:AarogyaBhaskaramu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
5
చం|| పదిపదునాలుగబ్దముల ప్రాయమున౯ ముకునుండి నిత్యము౯

బెదరున రక్తధారలు స్రవింపఁగఁజొచ్చె భయంకరంబుగా.

ఇదియును క్షోభపెట్టి కర మిప్పటి కిర్వదియేండ్లనుండి యె

య్యదియెదొ పీల్వఁ దగ్గినది. అద్దియు నీదయచేన భాస్కరా! ౨౮

ఉ|| ఆమము వృద్ధిఁబొందె నొగి న య్యెలప్రాయమునంద. అంత న

య్యామము గొంతునుండి పయి కాగతమై నసదగ్గుతోడఁదా

యీమహి నమ్మివేయఁబకు చించుక బాధకు హేతువయ్యును౯

నామది కెక్కదయ్యె బలునాళులదాఁక నదేమొ బాస్కరా! ౨౯

ఉ|| ముమ్మరమైన మోహమును మొత్త సమర్థుఁడఁగామి వచ్చి పం

దొమ్మిదవబ్దమందునన దూరుజ లెంతయు నావరించుడు౯

వమ్మయిపోయె మేల్తనువు. వానిని వాని భుజింప నీదయ౯

క్రమ్మఱ స్వాస్థ్యమేర్పడియె. కాని పురాస్థితిరాదు భాస్కరా! ౩౦

ఉ|| మూత్రముతోడఁ దేజమును బోవఁదొడంగెను నాఁటినుండి యే

మూత్రమొ దాననుండి యణుమాత్రము మార్పునుజెందఁజొచ్చెఁదా

గాత్రము. పాటనంబునకుఁ గల్గెను లోపమొకింత. ఐనను౯

ధాత్రి భవ ద్ఘృణాబలమునం దనుయాత్ర కృతంబు భాస్కరా!

ఉ|| ఇంకనుగొన్ని యామయము లింతవొ యంతవొ యాగతంబులై

సంకటపెట్టి కొంతపడి చన్నవి తిన్న ఘనౌషధంబుల౯.

కింకరణీయతాజ్ఞుఁడను ఖన్నుఁడనై మనఁగొన్ని నాళ్ళకు౯

జంకి తమంతఁదామ యవి చన్నవి యందొకకొన్ని భాస్కరా!

ఉ|| ఉక్తులిఁకేల పెక్కు? లెవియో రుజ లప్డపు డంకురించుచు౯

వ్యక్తములైయొ కాకయొ వినాశము నొందుచువచ్చె వెండియు౯.

రస్తసమృద్ధమౌచు మెయి రాజిలుచుండిన యన్నినాళు లీ

ఉక్తవిధంబునం గృతమహో! తనుయాత్ర మదీయ భాస్కరా!

ఉ|| నాశముఁజెందుచున్నతవొ నాదు శరీరమునందు గుప్తమై

యే శయనించియున్నయవొ యెవ్వఁడెఱుంగును గాని మామకీ

నాశయముల్ ప్రజాసముదయంబునకుం దెలియంగఁజేయుచు౯

దేశముఁ జుట్టివచ్చుటకు దేహబలం బది యుండె భాస్కరా. ౩౪