పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హోమ్‌వుడ్‌కు వలస వచ్చిన తరువాత అక్కడికి ఇంకో వాసితుణ్ని తీసుకోవచ్చారు. అతడు థామస్ ఎన్, మిల్లర్ - యితడు పరీక్ష కాగిన నిజమైన మిత్రుడు. సంగీతం, గ్రంధాలు దేశయాత్ర అన్న విషయాలల్లో ఆండ్రూతో అన్యోన్యత గలవాడు. ఆండ్రూ కార్నెగీలో ఉన్న మనోహరమైన లక్షణాలల్లో ఒకటి మైత్రి నార్జించుటంలోగల సామర్థ్యం. మిత్రులయెడ అతనికుండే ఆసక్తి అతి తీవ్రమైంది. నిత్యమైంది. మిత్రులను అతడెన్నడూ మరిచిపోయేవాడుకాడు. వృద్ధాప్యం వృద్ధిపొంద తున్న సంవత్సరాలల్లో అతనికి అత్యానందప్రదాలైన దినాలు బహుకాల వియోగానంతరం యౌవనం నాటి మిత్రులను కలుసుకొన్న రోజులే.

హోమ్‌వుడ్ లోని విజ్ఞావంతులు, సాంస్కృతికులతో గూడిన సమాజం హృదయ పూర్వకంగా ఆండీని తమలో ఒక సభ్యుడ్ని చేసుకొన్నవి. ఆ ప్రాంతంలోకల్లా పెద్ద న్యాయమూర్తి విలియం జోన్సు, మంచి విద్వాంసుడు. వుద్యోగ విరమణకాలంలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. కొన్నాళ్ళు సెనటర్‌గా వ్యవహరించాడు. కొన్నాళ్ళు యుద్ధ కార్యదర్శి, రష్యామంత్రి అతని భార్య రాజనీతి కోవిదులు, దౌత్య తంత్ర నిర్వాహకులు జన్మించిన కుటుంబంలో పుట్టింది. ఈమె బైరన్‌కలికి దూరపు బంధువుకూడాను. వీళ్ళతో కొంతగా భీతిని కలిగించే పరిచయము, దీనికితోడు మిసెస్ ఎడిసన్, ఆమె కుమార్తెల పరిచయం ఆండ్రీ ఆత్మతృప్తికి ఒక కుదుపును కల్పించింది.