పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరకూ అట్టిపెట్టమని ఆ ఆస్తిగలవాళ్ళతో చెప్పి ఉంచుతాను."

ఆండ్రీ, తల్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించటానికి వెళ్లారు. దాన్ని చూడటంతోటే వారికి ఎంతో ఉల్లాసం కలిగింది. అది మంచి విశాలమయిన మైదానాలు, చెట్లగుంపులు, పొదలు, కోనలు - వీటిమధ్య ఉన్న రెండంతస్థుల కాటేజి, నగరంలోని కార్నెగీల యిల్లు చిన్నజాతిలోది. అయినా కుటుంబనికి చాలినంతగా స్థలముంది. మార్గరెట్ మిత్రబృందాన్ని పెంపొందించుకొని, అల్తూనాలో కంటే అధిక విస్తృతిగల పుష్పోధ్యానాన్ని పెంచుకొని తన జీవితంలోని ఆనందకరమైన అనేక సంవత్సరాలను ఇందులో గడిపింది.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాత్రి ఏగంటలోనైనా ఆదివారమైనా యువకుడైన ఆ ఉన్నతోద్యోగి పిలుపును అందుకొనే టందుకు వీలుగా ఇంటిలోకి టెలిగ్రాపు తీగ అమర్చబడింది.

ఇరుగుపొరుగు వారైన స్టువార్టులుకూడా నెమ్మదిగా వారికి ప్రీతి పాత్రులైనారు. ఆండ్రూ ఇక్కడ యువకుడైన ఇరుగు పొరుగు జాన్ వాన్డి వోర్డును కలుసుకున్నాడు. ఇతడిలాగనే మిష్టర్ స్టీవర్ట్ కాలంగడిచిన తరువాత కార్నెగీ యినుము-ఉక్కు-వ్యాపారంలో భాగస్థుడైనాడు. ప్రియమైన "వాంటీ" ఆండ్రూ చివర చివరగా చేసిన కొన్ని విదేశ ప్రతూర శాలల్లో అతనికి సహచరుడుగా వుండేవాడు. కార్నెగీల