పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"తనబోటివారిని ఉన్నత విద్యావంతులనుంచి వేరు చేసే వర్ణనాతీతము. గణనాతీతము అయిన అఘా తాన్ని అర్థం చేసుకొన్నాను" అని అతడు తరువాతా జీవితంలో అంగీకరించాడు. న్యాయమూర్తి బల్కిన్ పఠనకక్ష్యలోనీ చలిపొయ్యి చుట్టూ జరిగే సంభాషణలు డార్విన్,హెర్బర్టు స్పెన్సర్, జాన్ స్టువార్టుమిల్ మొదలయిన ప్రముఖుల రచనలు చదవమని ప్రేరేపించాయి. మిసెస్ ఎడిసన్‌తో కలిగిన పరిచయాలు అతని సంభాషణలోను, ప్రవర్తనలోను కోసులు కోసులుగా మిగిలిపోయిన అంచులను నునుపు చేశాయి. పిట్స్‌బర్గ్గుదాని పరిసరప్రాంతం ఇంతవరకూ ఎందులో చేరివున్నట్లు భావింపబడుతున్నదో ఆ పశ్చిమప్రాంతంలో నివసించేయువకులు వదులైన కాలర్లు, బండబూట్లమీద ప్రీతితో మొరటుతనాన్ని వెలిబుచ్చే అజాగరూకతను ప్రదర్శిస్తున్నారు. ఆ రోజుల్లో 'పిచ్చి సొగసు' (Foppish) అన్న ముద్రను వెయ్యదగ్గ ప్రతిదీ అసహ్యించుకోబడేది. కొన్ని సమయాలల్లో 'కిడ్ గ్లౌ'లను ధరించే రైల్‌రోడ్ వారి సాధారణోద్యోగి పరిహాసపాత్రు డౌతుండేవాడు. యువకుడైన కార్నెగీలోవున్నా అటువంటి అభిప్రాయాల నన్నింటినీ మిసెస్ ఎడిసన్ మృదువుగా తొలగించివేసింది. కొన్ని వేళల్లో ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఆతని మంకుపట్టును కొంతగా ఆమె అణచిపెట్ట వలసి వచ్చింది. అయితే అతడు ఎప్పుడూ నైజాన్ని ప్రదర్శించే వాడు కాడు. తన ఆరంభదశలో క్షుద్రమైన స్థితిగతులను గురించి ఎన్నడూ సిగ్గుపడేవాడు కాడు. 'వింత