పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్నది. ఇక్కడ విలియం మారిసన్ కొంత ఆర్జించుకున్న వ్యక్తి. జస్టిస్ ఆఫ్ పీస్. పరిసరాలల్లోని రైతు లకు ఇన్వెస్టిమెంటు బ్రోకరు ఇంటిమీద రెండో తాకట్టు పెట్టించుకొని డబ్బు ఇచ్చాడు. అతని సోదరి పిట్స్ బర్గుకు విజయంతో తిరిగి వచ్చింది.

ఆండీ మిస్టర్ స్కాట్‌కు డబ్బు ఇచ్చేటప్పటికి చాలా రోజులు గడిచాయి. అందువల్ల "ఆవ్యక్తి, రైనాల్డ్సు స్టాకుకు ధర పెంచాడు. అతనికి ఇప్పుడు ఆరువందలు కావాలిట" అన్న ఊహించని మాటలను డబ్బు నిచ్చేటప్పుడు అతడు వినవలసి వచ్చింది.

ఆండ్రూ క్షణకాలం నిశ్చేష్ఠుడయినాడు. అయితే మిస్టర్ స్కాట్ "మిగిలిన వంద నీకోసం తాత్కాలికంగా నేను చూస్తాను. నీవు వీలయినప్పుడు వీలయినట్లుగా ఇవ్వవచ్చు" అన్నాడు.

కొన్నిరోజులు గడిచాయి. వొకనాటి ఉదయం, మూలన ఆడమ్స్ ఎక్స్ప్రెస్ ముద్ర వున్నబరువయిన తెల్లని కాగితపు కవరు బల్లమీద వుంది. విసరినట్లుగా దానిమీద "ఆండ్రూ కార్నెగీ ఎస్క్వైర్" అన్న చిరునామా కన్పించింది. దాని లోపల పదిడాలర్లకు గోల్డ్ ఎక్సేంజి బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మీద ఇచ్చిన చెక్కు వకటుంది. ఇది అతని మొదటినెల డివిడెండు. ఆ చెక్కుమీద పెద్దదిగా విస్పూర్తితో కనిపించిన కాషియర్ జె. సి. బాబ్ కాక్ సంతకాన్ని తాను శ్రమించకుండా, స్వహస్తాలతో, చెమ