పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుండానే, ఒక్కమాటు రెప్పలల్లార్చి మిస్టర్ స్కాట్ ఎందుకయినా మంచిదని ఇలా అన్నాడు. "ఎందుకంటే, అదివుంటే నీకోసం ఒక పెట్టుబడి నిలిచివుంది-ఆడమ్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలోని పదిషేర్లు, ఈనాడు విపణిలో ఉన్న వాటిలోకల్లా ఇవి ఉత్తమమయినవి. బహుశ: గిల్ట్ ఎడ్జిడ్ కూడా అయి వుంటవి. ఇవి షేరు ఒకటికి ఒక డాలరు నెలకు డివిడెండుగా యిస్తున్నవి. నాకు తెలిసిన వొక వ్యక్తికి వెంటనే డబ్బు కావలసివచ్చి ఈ స్టాకును అమ్ముతున్నాడు. నీవు మరి ఆ డాబ్బు తీసుకు రాగలవా!"

ఈ సమస్త జగత్తులో అయిదువందల డాలర్లు తన కెలా లభ్యమౌతాయని ఊహిస్తున్నపుడు అతని తలలో మోత పుట్టటం మొదలుపెట్టింది. దయగల తనపై అధికారి ముఖ్యంగా ఈ సదవకాశాన్ని తా నే కబళించకుండా తన కిప్పించటమనే త్యాగం చేస్తున్నాడు. ఇట్టి స్థితిలో ఈ అవకాశాన్ని పోగొట్ట కోకూడదు.

"ఎలాగో చేకూర్చుకోగల"నని సమాధానమిచ్చాడు.

రెబెక్కా వీధిలో ఇంటికి అయిదువందలు చెల్లించటం జరిగింది. మొత్తమంతటికోసం దాన్ని తాకట్టుపెడితే సరిపోతుందని ఆండీ ఆశించాడు. సాహసించి ఆవిధంగా తాకట్టు పెట్టించుకొనే వ్యక్తి ఒక్కడే వున్నాడు. మిష్టర్ స్కాట్ నిర్ణయంమీద పరిపూర్ణమయిన విశ్వాసంగల ఆండీ తల్లి "నేను బ్రదర్ విలియంను ఈ డబ్బిమ్మని అడుగుతా" నన్నది. యాబైమైళ్లు ఆవిరి-పడవలో ఓహెయో నదిమీద దిగువగా ప్రయాణంచేసి ఆమె ఈస్టు అవర్ పూల్ చేరు