పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టోడ్చకుండా పెట్టిన పెట్టుబడు మీద తొలి ఆదాయాన్ని పొంది నప్పటి ఆనందాస్పందనాన్నీ జీవితాంతం వరకూ అతడు ఎన్నడు మరచి పోలేదు. తనలో తాను 'యు రేకా! [గొప్పది కనిపెట్టాను.] ఇది బంగారు గ్రుడ్లను పెట్టేబాతు' అని నెమ్మదిగా అనుకున్నాడు.

చెక్కును మార్చకుండా వారం చివరదాకా వుంచి తన ప్రియమిత్రులైన టామ్ మిల్లర్, జాన్ ఫిప్స్, జిమ్మీ విల్సన్, విల్లీ కౌల్స్‌లకు నలుగురికీ తమ వనవిహార సమయంలో చూపించాడు. వాళ్ళు "ఎస్క్వైర్" అని అతని పేరుకు చివర తగిల్చిన పదంమీద చతుర క్రీడలాడారు. కానీ వాళ్ళకూ డివిడెండు చెక్కు ఎంతో నచ్చికను కలిగించింది.

"అభ్యుదయానికి ఇదే మార్గ" మన్నాడు ఫిప్స్.

"జాన్, ఇటువంటి అవకాశాలు వస్తాయేమో నేనూ కనిపెడుతుంటాను," అని ఏకీభవించాడు జిమ్మీ!

"ఈపని మన మందరం చేద్దాం. ఒకరికొకరం చెప్పుకుంటుందాం." అంటూ వుత్సాహాన్ని ప్రదర్శించాడు టామ్ మిల్లర్.

"ఒక్కడికి మించిన పెట్టుబడిని గురించి వింటే వీలునుబట్టి అందరం ఒకటై అందులో ప్రవేశద్ధాం మన్నాడు ఆండ్రూ.

"చాలా దొడ్డఅభిప్రాయం" అని ఒప్పుకున్నాడు. టామ్ అందువల్ల వీలు కలినప్పుడల్లా తరువాత కొన్ని