పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు. రెండోమారు వెళ్ళినప్పుడు కఠినుడు, మితభాషి అయిన జనరల్ సూపరింటెండెంటు మిష్టర్ లోంబయర్టు అతణ్ని తేనీటి విందుకు ఇంటికి పిలిచి ఆశ్చర్యాన్ని కల్గించాడు. మిష్టర్ లోంబయర్టు వచ్చిన అతిధిని ద్వారం దగ్గిరనే మిసెస్ లోంబయర్టుకు "ఇతడే మిష్టర్ స్కాట్స్ ఆండీ" అని పరిచయం చేశాడు. అతడు కార్యాలయంలో కనిపించేటంతటి శీతలంగా ఇంటిదగ్గర కనిపించలేదు. తన్ను గురించి చేసే పై రీతి పరిచయాన్ని విన్న తరువాత అందరూ తన్ను అలా చెప్పుకొంటుంటే తృప్తిని పొందేటట్లు ఆండీకి స్కాట్ మీద గౌరవం కలిగింది. ఒకనాడు రైల్ రోడ్ అధ్యక్షుడు ఎడ్గర్ థామ్సన్ యువకుడయిన అసిస్టెంటు గదిలోకి తల చొప్పించి చూచి "స్కాట్స్ ఆండీవి నీవేనా!" అనిప్రశ్నించాడు. ఇది అతనికి సర్వసాధారణమైన పేరైపోయింది.

ఒకరోజున ఆండీ కార్యాలయానికి వెళ్ళేటప్పటికి తూర్పు డివిజన్‌లో ఒక ప్రమాదం సభవించుట వల్ల పశ్చిమానికి వెళ్ళవలసిన ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైందనీ, తూర్పుకు వెళ్ళే పాసింజెర్లు వంక వంక దగ్గిరా ఒక ఫ్లాగ్ మానును ముందు పంపిస్తూ నెమ్మదిగా ప్రాకుతున్నట్లు నడుస్తున్నవని, రెండువైపులకు వెళ్ళవలసిన సామాను బండ్లు ప్రక్క పట్టాలమీద నిలిచిపోయినవని తెలుసుకున్నాడు. ఒకేదారి వున్న రైలు మార్గాల పద్ధతిలో బండ్లు నడపటం ఇంకా యెంతో అనాగరిక స్థితిలో వుంది.

మిష్టర్ స్కాట్ ఎక్కడ వుందీ ఎవరికీ తెలియదు. బహుశ: అతణ్ని ఏదో పనిమీద పిలిచి వుంటారు...... ఏర్పడ్డ