పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరిస్థితికి ఆండీ కళవళ పడుతున్నాడు. ఎంతో పనిచేసి చాలా అలిసిపోయిన చోదకులకు విశ్రాంతి నిచ్చి పరిస్థితిని కొంత చక్క దిద్దాలనే కుతూహలాన్ని అతడు ఆపుకో లేకపోయినాడు. ఇటువంటి అత్యయిక పరిస్థితులను పూర్వం ఇతడు మిష్టర్ స్కాట్ సూచనలతొ అతడు సరిదిద్దాడు. అందువల్ల అతడు తన బాధ్యతమీదనే బండ్లను నడిపించటం. అవి కలుసుకునే ప్రదేశాలను నిర్ణయించటం జరిగించాడు. చివరికి పై అధికారి వచ్చేటప్పటికల్లా సర్వం సుగమంగా సాగిపోతున్నది.

ఆండీ బల్లదగ్గిరకి అతివేగంగా చొచ్చుకో వచ్చి మంచిది. పరిస్థితులు ఎలా వున్న"వన్నాడు.

"మిష్టర్ స్కాట్, నాకు మీరు ఎక్కడా కనిపించలేదు. మీ పేరుమీదనే ఉదయం ఆర్డర్ల నిచ్చాను" అని సమాధానం చెబుతున్నప్పుడు ఆండీకి గొంతు బాగా పెకిలి రాలేదు.

అతడు ఇచ్చిన ఆర్డర్ల కాపీ లన్నింటినీ చూపించాడు. లైనుమీద వున్న బండ్లన్నీ - సామాను బండ్లు, పాసింజరు బండ్లు - ప్రస్తుతం ఏ స్థితిలో ఎక్క డెక్కడ వున్నదీ తెలియజెప్పాడు. చెప్పటం ముగించగానే సూపరింటెండెంటు ఆశ్చర్యపడుతూ ఆండీ ముఖంలోకి చూశాడు. బాలుడు సాహసించి చేసిన పనిని తా నెలా స్వీకరించాడో తెలియజేయకుండానే అతణ్ని ఇంకా అనుమానపడే స్థితిలోనే వుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫ్రయిట్ ఏజంటు మిష్టర్ ప్రాన్సిస్ వచ్చినప్పుడు ఆతనితో నవ్వుతూ "నా చిన్ని తెల్లజుత్తు. స్కాచ్ భూతం ఏంచేశాడో నీకు తెలిసిందా?" అని