పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"అలాగా! ఏమన్నాడు!' అని ఆండీ వెంటనే సర్దుకున్నాడు.

"తనకు నిన్ను గుమాస్తాగాను, ఆపరేటర్ గాను తీసుకు రాగలవా!" అని నన్నడిగాడు. రోడ్డువారు స్వంత తంతి కార్యాలయాన్ని పెట్టబోతున్నారు. నీకు తెలుసా? అది చాలా అసాధ్యమైన పని. నీవు ప్రస్తుతోద్యోగంలో చాలా సంతృప్తిగా వున్నావని నేను అతనితో చెప్పాను."

"ఆగు! అంత త్వరపడకు" అని చేయి యెత్తి ఆండీ అతణ్ని ఆపాడు.

"ఆయనకు కావాలంటే నన్ను పెట్టుకోవచ్చు. వెళ్ళి ఇలాగని చెప్పు."

దీని పరిణామంగా ఫిబ్రవరి 1 - 1853 న ఆండీ నెల ఒకటికి ముప్పదియైదు డాలర్ల జీతంతో స్కాట్ దగ్గిర పనిచేయటానికి కుదిరాడు. అతడికి కొంత భయపడేటంత వేగముగా ప్రమోషన్లు వచ్చాయి.

అతని తల్లి ఇప్పుడు చెప్పులు కుట్టటం మానేసింది. త్వరలోనే అండు డేవిడ్ మెక్కార్గో, రాబర్టు పిట్కైరస్ లకు రైల్ రోడ్ సంస్థలో ఉద్యోగా లిప్పించగలిగాడు. అల్తూనాలోని జనరల్ సూపరింటెండెంట్ అయిన లోంబర్ట్‌కు అతడు అసిస్టెంటు కాగలిగాడు. అప్పుడు అల్తూనా ఒక చిన్న గ్రామం. అయినా పెన్సిల్వేనియా రైలు మార్గాలకు అది కూడలి.

పిట్స్ బర్గు జీతాల పట్టిక ననుసరించి జరిగే బట్వాడా కోసం డబ్బు తీసుకు రావటానికని ఆండీ అల్తూనాకు వెళ్ళే