పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అదేమీ చెడ్డపనికాదు" అని తండ్రి అతని అభిప్రాయాన్ని సరుదిద్దాడు. "ఇదుగో నాకు నా దుప్పటి వుంది. చాలా బాగా నిద్ర పోగలను అమ్మకం అంత చులకనగా లేదు బాబూ, అందువల్ల నేను జాగ్రత్తగా మెలగాలి."

"కానీ నాన్నా! నీవు అమ్మ స్వంత బండిలో ప్రయాణం చెయ్యటానికి యింకా ఎంతో కాలం వేచిఉండ వలసిన అవసరం లేదు" అన్నాడు ఆండీ ఉత్సాహంతో.

తండ్రి నిశ్శబ్దంగా అతనిచేయి పట్టుకున్నాడు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తరువాత ఒక పావుగంటలో పడువ బయలుదేరి బోతున్నప్పుడు విలియం కుర్రవాడి చేతిని ఉల్లాసంతో నొక్కి అన్నాడు. "ఆండ్రా! నిన్ను చూచుకొని నేను గర్విస్తున్నాను.

ఈ సమయంలో థామస్ ఎ. స్కాట్ అన్న వొక విశిష్ట వ్యక్తి పెన్సిల్వేనియా రైలు రోడ్డువారి ఫిట్స్ బర్గు డివిజనుకు సూపరింటెండెంటుగా వున్నాడు. అల్తూనాలో ఉన్న తన పై వాడయిన లోంబయర్టుతో తంతిద్వారా వుత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి అతడప్పుడప్పుడూ తంతి కార్యాలయానికి వస్తుండేవాడు. యిలా వస్తున్న సందర్భాలల్లో యువకుడయిన ఆపరేటరుమీద దృష్టి నిలిపి అతనితో మాట్లాడటం కోసం కొంతసేపు ఆగుతుండేవాడు.

ఒక తంతివార్తను తీసుకొని మిష్టర్ స్కాట్ అసిస్టెంట్లలో ఒకడు ఆండ్రీ కార్యాలయానికి వచ్చాడు. "మిష్టర్ స్కాట్ ఈనాటి ఉదయం నిన్ను గురించి మాట్లాడాడు."