పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాతి కంతటికీ గొప్ప శ్రేయస్సును చేకూర్చిన కార్నెగీ ఉచిత ప్రజా గ్రంథాలయ భావానికి మూలభూతుడైన కల్నల్ జేమ్స్ ఆన్డన్‌సన్‌కు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండవలసి ఉంది. కార్నెగీ తరువాత కాలంలో ఇలా వ్రాశాడు. "మానవుడు నేటివరకూ కూడబెట్టిన కోటానకోటి ద్రవ్య సంపదనంతటినీ ఇచ్చినా దానికి ప్రతిగా దేనిని ఇవ్వలేనో అటువంటి సాహిత్యాభిరుచిని నాకు కలిగించిన అతనికి" ధనవంతుడైన తరువాత కార్నెగీ అలిఘనీకి ఇచ్చిన గ్రంథాలయంలో హాలుకుముందు కల్నల్ స్మృతి చిహ్నంగా ఆతడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దానిక్రింద ఉన్న రచనలో కొంతభాగం ఇలా ఉంది.

"పశ్చిమ పెన్సిల్వేనియాలో ఉచితగ్రంథాలయ స్థాపకుడైన కల్నల్ ఆండర్ సన్‌కు... ఇది వేటి మూలంగా యువకులు ఆరోహింపగలరో అట్టి అమూల్య జ్ఞాన భావనా నిధులు ఎవరికి ఆరీతిగా విస్తృతం చెయ్యబడ్డవో ఆ "కార్మిక బాలకు"లలో ఒకడైన ఆండ్రూ కార్నెగీ కృతజ్ఞతా పూర్వకంగా నెలకొల్పిన స్మృతి చిహ్నం."

తన చెలికాండ్రయిన జాన్ ఫీప్స్, టామ్ మిల్లర్, జిమ్మీ విల్సిన్, విల్లీ కౌలీలతో బాటు మిష్టర్ ఫిప్స్ పాదరక్ష నిర్మాణశాలలో గడిపేది తప్ప మిగిలిన సాయంతనాల నన్నింటిని-ఇంటిదగ్గిర ఉండే ప్రతి రెండో సాయంతనాల నన్నింటినీ-ప్లూటార్క్‌లైవ్స్ మెకాలే లాంబుల వ్యాసాలు మెక్సికో పెరూలమీద స్పైనీయులు చేసిన విజయాత్రలను