పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురించి ప్రెస్ కాట్ రచించిన చరిత్రలు, మిగిలిన అన్నింటికంటె అతి శ్రద్ధతో పఠించిన బాన్ క్రాఫ్ట్ కృతి హిష్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ చదవటంతో అతడు గడిపివేసేవాడు. అతడు కొన్ని సాంకేతిక గ్రంధాలను, ముఖ్యంగా లోహ నిర్మాణాన్ని (Iron Making) గురించినవి, అతిజాగరూకతతో బఠించాడు. అప్పుడు ఎవరూ గ్రహింపక పోయినప్పటికీ ఇది అతని భవిష్యత్తు కొక సూచికగా కనిపిస్తున్నది.

అంకుల జార్జి లాడర్ తోను, యువ జార్జితోను, బాల్యంలో తన ప్రీతికి పాత్రుడైన కజిన్ డాడ్ తోను అతడు ఎప్పుడూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుండేవాడు. ఆ లేఖల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలల్లోని స్వేచ్ఛా సాహసాలను గురించి అత్యుక్తులు, గర్వోక్తులు ఉంటుండేవి. ఈ లేఖలే కజిన్ డాడ్ మనస్సులో బీజాలను నాటి తరువాత కొలది సంవత్సరాలల్లో నే అతడు అమెరికాకు వలసవచ్చేటట్లు చేశాయి.

విలియం కార్నెగీ స్వెడెన్ బోర్జియన్ చర్చిలో చేరాడు. అతనిభార్య మతవిషయాలల్లో తాను దూరంగా ఉంటున్నా అతని విశ్వాసాలతో ఎట్టి ప్రమేయం పెట్టుకోలేదు. ఆండీ కొన్నిసంవత్సరాలు అక్కడి సండే స్కూలుకు వెళ్లాడు. అప్పుడు అతడు విశేషంగా స్వెడెస్ బోర్జియన్ విషయాలమీద వ్రాసిన పుస్తకాలున్న సండే స్కూల్ లోని చిన్ని గ్రంథాలయానికి లై బ్రేరియన్‌గా ఉన్నాడు. 'డ్యూడ్రాప్‌' అనే పేరుగల ఆ సండే స్కూల్ పత్రికకు అప్పు