పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాన్ని ఆలోచించాడు. రెబెక్కా వీథిని చేరుకోగానే ఉచ్ఛ్వాసంకోసం కొంత వేగాన్ని తగ్గించాడు. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడూ ఇస్తున్న పదకొండు డాలర్ల ఇరవైయైదు సెంట్లను తల్లిచేతికి ధైర్యంగా ఇచ్చాడు. తనకోసమని అతడు ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టక పోవటంవల్ల మిగిలిన పిల్లవాళ్లు అతణ్ని గురించి పిసినిగొట్టని అనుకుంటుండెవాళ్లు. కార్నెగీ కుటుంబసభ్యులమధ్య ఎంతటిసాన్నిహిత్యమున్నదో కుటుంబములో సంపాదించే ముగ్గురు ఇంటిలోకి వస్తు సామాగ్రిని. ఫర్నిచరు దుస్తులను కొనటానికీ, స్కాట్లాండులోని పూర్వ మిత్రురాలయిన మిసెస్ హెస్టర్ సన్ ఇచ్చిన ఇరవై పౌనుల అప్పును తీర్చివేయటానికి పెన్నీలతో సహా ఎంత జాగ్రత్తగా కూడబెట్టుతున్నారో వారికి తెలియదు.

ఆండీ తల్లి అవకాశ మున్నప్పుడల్లా ఒక వెండి అరడాలరును సంగ్రహించి ఈ నిధికి చేరుస్తుండేది. చివరకు ఇవి రెండు వందలు అయినప్పుడు ఆండీ వీటిని ఫిట్స్‌బర్గ్‌కు మోసుకుపోయి ఇరవై పౌనులకు డ్రాప్టు కొని మిసెస్ హెస్టర్ సన్ కు పంపించాడు. ఆనాడు మహానంద సమయం. కార్నెగీ కుటుంబం ఋణవిముక్తి పొందింది.

ఆనాటి రాత్రి తన రహస్యంతో ఉబ్బితబ్బిబ్బులవుతున్నా తాను తన తొమ్మిదేళ్ళ తమ్ముడు టామ్ ఇంటివెనక భాగంలోని పడక గది లోపలికి వెళ్ళేటంతవరకూ ఆండ్రూ తన అదృష్టాన్ని గురించి ఏమాత్రం చెప్ప లేదు. తన రహస్యాన్ని ఏదో నణిగినట్లు బయటపెట్టి రెండు వెండి డాలర్లను ఇరవై యైదు సెంట్లను విడి విడి జేబుల్లోనుంచి తీసి తమ్ముడికి