పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్ల పెద్దదైన ఆ కర్తవ్య నిర్వహణకు హఠాత్తుగా పిలుపు తనకు వచ్చినందుకు ఆండి కొంతగా చకితుడయినాడు. పంపవలసిన తంతి వార్తలను అందుకుంటున్నాడు. ఆపరేటర్ గదినుంచి బయటికి వచ్చిన వాటిని అంద జేయటంకోసం వార్తాహారులకు పంచియిచ్చాడు. మిష్టర్ గ్లాస్ అప్పుడప్పుడే రాజకీయాలల్లో ప్రవేశిస్తుండటంవల్ల అతడు లేనిసమయాలల్లో కార్యాలయ వ్యవహారాలను చూడవలసిందని ఆండూలను తరువాత పదేపదే పిలవటం జరిగింది.

ఇప్పుడు బాలురకు పదకొండుం బాతికి డాలర్లు ఇస్తున్నారు. తరువాత వచ్చిన జీతపు - రోజున పుచ్చుకోవటం కోసం బాలురందరూ వరుసగా నిలబడ్డారు. ఆండీ తల్లడిల్లినట్లుగానే అందరికీ జీతం బట్వాడా చేయటం జరిగింది. భీతివల్ల అతడి తల తిరిగిపోతున్నది. అతణ్ని అవసరంలేదని పంపించి వేస్తారా ఏమిటి? అతని తప్పేమిటి? మిగిలిన పిల్ల లందరూ గది విడిచి పెట్టి వెళ్ళిన తరువాత మేనేజరు నీకు రెండుంబాతికి డాలర్లు అదనం వస్తుందని చెప్పి అతడి చేతికి పదమూడున్నర డాల ర్లిచ్చాడు.

అది ఒక శనివారం సాయంత్రం. తరువాతి కాలంలో ఆండీ ఇది బాగా గుర్తుపెట్టుకొన్నాడు. అతడు ఇంటికి రావటంలో చాలాభాగం పరుగెత్తుకుంటూ వచ్చాడు. నడిచేవాళ్ళతో బాట క్రిక్కిరిసి ఉండడంవల్ల కోరినంత వేగంగా పరుగెత్తే అవకాశం లేకపోయింది. అందువల్ల అతడు బండ్లు వెళ్ళె మార్గాన అలిఘనీ బ్రిడ్జికి అడ్డంగా పడి పరుగెత్తి ఇల్లు చేరుకున్నాడు. మధ్యలో ఒక నాటకీయమైన చిన్ని పథ