పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చూపించినప్పుడు అవి ఒకదాని కొకటి తగిలి చప్పుడు కావటము కాని, వాటిని గురించి అతడు ప్రశ్న లడగటం కాని ఇష్టపడ లేదు. టామ్ ఆ సంఘటనలోని ఘనతకు అబ్బురపడ్డాడు. చివర కడిగాడు : "ఆండీ ! వీటితో నీ వేమి చెయ్య దలిచావు !"

ప్రక్క మీదికి వాలుతూ "ఎప్పటికయినా అమ్మ కే ఇస్తాను" అని సమాధానం చెప్పాడు. "మనవా ళ్ళందరికీ గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించదలుచుకొన్నాను. అంతే టామ్ పైకి పోవటం ఆరంభించాను. ఎప్పుడో ఒకరోజున మన మిద్దరమూ "కార్నెగీ బ్రదర్స్" అన్న పేరుతో వ్యాపారము చేద్దాము.

"ఎటువంటి వ్యాపారం ?" టామ్ తెలుసుకోదలచుకున్నాడు.

"తప్పక చేద్దాం. నేను ఇంకా నిశ్చయం చేసుకోలేదు. కానీ మనం ధనాన్ని సంపాదించి తీరుతాం. నాన్న, అమ్మ మంచి బండి ఎక్కి తిరుగుతారు". గురక వినిపించి తాను చెప్పేది తమ్ముడు వినటం లేదని తోచేటంత వరకూ అతడు అలాగే భావ వీధుల్లో సంచరించాడు.

మరునాడు ఉదయకాల భోజన సమయంలో అతడు రెండుంబాతికి డాలర్లు బల్లమీద వుంచినప్పుడు తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయినారు. తల్లి కన్నుల్లోసంతోషాశ్రువులు ఒక్కమారుగా పొంగి సుళ్లు తిరిగాయి. భుజంమీద చెయ్యివేసి తండ్రి "ఆండ్రూ ! నిన్ను చూచి