పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాధ్యతవహించ వలసివచ్చింది. తీపివస్తువులంటే అతిలోభాన్ని చూపించే కుర్రవాళ్ళల్లో మిక్కిలి చెడ్డవాడు బాబ్‌పిట్కైరస్. ఇతని దుబారాతనాన్ని గురించి హెచ్చరించి ఆండీ చీవాట్లు పెట్టినప్పుడు "ఇతడు నా కడుపులో జీవజ్జంతువు లున్నాయి ఆండీ! తీపివస్తువులను పెట్టి వాటిని మేపకపోతే అవి నా డొక్కలు కొరికేస్తా"యని గంభీరంగా సమాధాన మిచ్చాడు.

వీరంతా ఎటువంటి బాలదళం ! ఇందులోని రాబర్టు పిట్కైరన్ మధ్య మధ్య తన డబ్బును పెట్టుబడులలో పెట్టి, తరువాత పెన్సిల్వేనియా రైల్‌రోడ్ కంపెనీకి ఉపాధ్యక్షుడైనాడు. డేవిడ్ మెక్కార్టో రైలుమార్గాలను నిర్మించటానికి పూనుకొని ఇతరులతో తలిసి అలిఘనీ వాలీ రైల్వే నిర్మాతల్లో ఒకడయినాడు. హెన్రీ ఆలివర్ ఒక పెద్ద ఉత్పత్తి సంస్థకు ప్రముఖుడయి మిన్నసోటాలోని లోహఖనిజ ప్రాంతాన్ని వృద్ధిపొందించటంలో సహకరించి చివరకు ఒక కోటీశ్వరుడిగా మరణించాడు. విలియం మోర్‌లాండ్ ఫిట్స్‌బర్గులో ఒక ప్రముఖుడయి, ఆటార్నీ పదవిని నిర్వహించిన వాడయి, అధిక సంపన్ను డయినాడు.

వార్తావహుడుగా ఆండ్రూ కార్నెగీ ఒక సంవత్సరం పనిచేసిన తరువాత ఒకనాడు మిస్టర్ గ్లాన్ పైనుంచి ప్రజా కార్యాలయంలోకి దిగివచ్చి మిస్టర్ బ్రాక్స్‌తో "నేను ఒక పనిమీద వెళ్లుతున్నాను. యువకార్నెగీని కొన్ని క్షణాలపాటు కార్యాలయంలో ఉండమనండి" అన్నాడు. అందు