పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పారితోషికంక్రింద వసూలుచేసుకునే అవకాశ మిచ్చారు. ఈ జాతి తంతివార్తలను అందజేయటంలో ఇతరులకంటె ఎక్కువవంతు తెచ్చుకొనే విషయంలో ఆ బాలురకు ఆలోచనలు చర్చలు ప్రారంభమైనవి. వాళ్ళ మైత్రికి భంగం కలగబోయేటంతగా కలతలు పెరుగుతున్నట్లు కనిపించాయి. అప్పుడు ఆండి అతనికి నైజమైన నీతి నిపుణతతో ఒకనాటి ఉదయం ఆ బాలబృందాన్ని వుద్దేశించి ఇలా అన్నాడు: "మనం ఇలా పోటీపడటం తగదు వార్తలను ఎవరు అంద జేస్తున్నా రన్నది మనం పెట్టుకోవద్దు. ఈ పదిసెంట్ల మొత్తాలను అన్నింటిని సమిష్టినిధిలో వేసి నెలాఖరుకు అందరము సమానంగా పంచుకుందాము*"

వ్యాపారంలో ఉపయోగింప బడుతున్న అర్ధంతో 'సమిష్టి' (Pool) అన్న పదంతో ఇతనికి ఇంకా పరిచయం కలగలేదు. కానీ అతడు చేసినది మాత్రం అదే. మిగిలిన బాలు రందరూ ఈ సూచన గురించి యోచించి, ఆండియే ఆ నిధికి కోశాధికారిగా వుండాలనే షరతుతో, అంకీకరించారు. దీని తరువాత దగ్గరలో ఉన్న ఒక తినిబండారాలమ్మే వాడి దగ్గర ఖాతాపెట్టి ఈ పదిసెంట్ల డబ్బులతో కొనుక్కుంటున్న కాండీ, కేకులను గురించి తప్ప మళ్ళీ ఎన్నడూ వాళ్ళమధ్య తగాదా రాలేదు. కొందరు తమకు రావలసినదానికంటే తినుబండారాలను ఎక్కువ వాడుకున్నప్పుడు ఆ వ్యాపారి నెలలోవచ్చె వారి వాటాలుపోను మిగిలిన డబ్బు చెల్లించవలసిందని కోరితే ఆండీ ఇద్దరు ముగ్గురు అతిగా వాడుకుంటున్న వాళ్ళ అదనపు అప్పుడబ్బులను గురించి