పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెనుకటంత చెడ్డది లేదా అంతకంటె మరీ చెడ్డది అయిన పని తనకు రానున్నదని అతడు అప్పుడు కొంచమైనా వూహించ లేదు. అతడు మిస్టర్ హా యిచ్చిన "సింగిల్ ఎంట్రీ బుక్ కిపింగ్" పని కొద్ది కాలంలోనే పూర్తిచేస్తుండే వాడు. యిది అతని పనికాలంలో సగానికైనా సరిపోదు. అందువల్ల మిగిలిన రోజంతా అతడు కండెలను నూనె తొట్టిలో ముంచి సరిచేస్తుండేవాడు. ఆ నూనెకు ఎంతో కష్టంమీదగాని అతడు సహించలేనంతటి కంపువుండేది. మనస్సును బూస్, వాలెస్ లమీద ఎంతగా లగ్నం చేసినప్పటికి యితడు దాన్ని సహించలేక పోతున్నాడు. ఓర్చుకోలేక పళ్లు మెలికలు తిప్పి కొరుకుతుండేవాడు. అయినా తను బాధపడుతున్నది తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాడు.

సాయంత్రం అతడు ఒక గంట సేపు ఫిలిప్ చెప్పుల దుకాణం దగ్గర జాన్ ఫిలిప్‌తోను, యితర బాలురతోను గడుపుతుండేవాడు. వీళ్ళలో ఎక్కువ మంది స్కాచ్ బాలురు. ఒకనాటి సాయంత్రం అతడు తన బుక్కీపింగు పనిని గురించి వాళ్ళకు చెబుతున్నప్పుడు టామ్‌మిల్లర్ "హా వ్యాపారం వంటి చిన్నదానికి సింగిల్ ఎంట్రీ బుక్కీ పింగు పనికివస్తే రావచ్చునుగాని పెద్దకంపెనీలన్నీ తమ లెక్కలను డబుల్ ఎంట్రీ విధానంలోనే వ్రాయిస్త"నన్నాడు.

యిది ఆండీకి క్రొత్త విషయం. అతడు ఆ క్రొత్త పద్ధతిని గురించి యింకా ఎక్కువగా తెలుసుకో దలచుకున్నాడు. అయితే దీన్ని గురించి టామ్‌కు వున్న జ్ఞానం చాల