పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని బాయిలర్ కిందనిప్పు వేస్తూ వికారమైన ఒక చీకటికొట్లో అతడు పనిచేయాలి. అటువంటి పరీక్షా సమయంవస్తే దాన్ని సర్ విలియం వాలెస్ ఎలా ఎదుర్కొనేవాడో అని ఊహిస్తూ తన వుద్యోగంమీద వుత్సాహాన్ని నిలుపుకోటానికి అతడు యత్నించాడు. ఉద్యోగం ఎంత అసంతృప్తికరమైనది. అయితే నేం అతడు దాన్ని ఎంతగా అసహ్యించుకుంటున్నాడో అతడు తల్లిదండ్రులకు తెలియనివ్వకూడదు.

తన కర్మాగారంలో ఒకమూల బల్లవేసుకొని కూర్చున్న మిస్టర్ హా - అతని కార్యాలయాని కంతటికీ అతడొక్కడే వుద్యోగవర్గం - ఒక రోజున కుర్రవాడైన ఆండీని పిలిచి అడిగాడు. "నీకు లెక్కలు బాగా తెలుసునా !" అని.

"ఆర్యా! తెలుసుననుకొంటాను" అన్న సమాధాన వచ్చింది.

"నీవు బాగా వ్రాయగలవా !"

"ఆర్యా ! చాలా అందంగా వ్రాయగలను."

"ఎలా వ్రాస్తావో చూడనీ. యిక్కడ కూర్చో."

ఆండీ చేతిలో ఒక కలాన్నిదోపి కాగితాన్ని ముందుకు తోశాడు. "ఆ చెడ్డగా లేదు. చెడ్డగా లేదు"అన్నాడు. వ్రాసింది చూస్తూ, నాకు బిల్లులు వ్రాసి పెట్టటం నీ కిష్ట మేనా!"

"ఓ తప్పక చేస్తాను." అని ఆశ్చర్యపడుతూ తాను పనిచేస్తున్న చీకటి కొట్టులోనుంచి బయటపడటానికి అతడు ఎంత ఆతురత వహిస్తూన్నాడో వెల్లడించే ఉత్సాహంతో అన్నాడు.