పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తక్కువ. కొన్ని సాయింతనాలు గడిచిన తరువాత ఎవరో ఒకవ్యక్తి క్రమమైన రుసుము తీసుకుని సాయంసమయాలల్లో ఆ బుక్‌కీపింగు విధానాన్ని పాఠం చెపుతాడనీ టామ్ తెలియ జేశాడు. కొన్నాళ్లు ఆలోచనలు సాగించిన తరువాత ఆండీ, టామ్, జాన్‌ఫిలిప్స్, లిల్లీకౌలీలు వాళ్ళకు వచ్చే కొద్ది రాబడులలోనే చిన్న మొత్తాలను ఆ పాఠాలు నేర్చుకునేటందుకు దాచుకుందామని నిశ్చయించారు. అప్పటినుంచి వారు డబల్ ఎంట్రీలోని విశేషాలను నేర్చుకుంటూ కొన్ని సాయంత్రాలు గడిపారు.

గత్యంతరంలేక ఇష్టంకాకపోయినా చేయవలసివచ్చిన పనిలో అమెరికాలో అతడు గడిపిన మొదటి ఒకటిన్నర సంవత్సరాలకాలమే అతని జీవిత మంతటిలోనూ ఆనంద విహీనమయిన సమయం. అయితే అతని అదృష్టంలో మార్పు సిద్ధంగా వుంది.

అప్పుడు 'తంతి' బాల్యావస్థలో వుండ తూర్పునుంచి పిట్స్‌బర్గువరకూ ఒకలైను పూర్తి చేశారు. దాని వ్యాపారం అతివేగంగా వృద్ధిపొందుతున్నది. దానికి స్థానిక కార్యనిర్వహకుడు డేవిడ్ బ్రూక్స్ అలిఘనీలో కార్నెగీలకు పొరుగువాడు. అతడు, అంకుల్ టాయ్ హోగన్ ఇరువురూ సాయంతన వేళల్లో చదరంగ మాడుకుంటూ ఆనందిస్తుంటారు.

ఒకరాత్రి వాళ్లు అప్పుడే ఒక ఆట పూర్తి చేశారు. మరొక ఆటకోసం పావులను అమరుసుండగా మిస్టర్ బ్రూక్స్ "మా వ్యాపారం అతి వేగంగా పెంపొందు తున్నది. అందు