పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురించి తా ననుకొనినట్లుగానే జరిపించాడు. తన మరణకాలంలో సజీవుడుగా వున్న వాడు ఒకే మాజీ అధ్యక్షుడు, విలియం హెచ్. ట్రాప్టుకు జీవితపర్యంతరం ప్రతిసంవత్సరం 10,000 డాలర్లు వార్షికం లభించింది. మిసెస్ గ్రోవర్ క్లివ్ లాండ్, మిసెస్ థియొడోర్ రూజ్వెల్టు ఒక్కొక్కరికి సంవత్సరానికి 5,000 డాలర్లు చొప్పున ఏర్పాటు చేశాడు. వైకౌంట్ మోర్లే, డేవిడ్ లాయడ్ చార్జి సంవత్సరానికి 10,000 డాలర్లు చొప్పున స్వీకరించారు. పార్లమెంటులో లేబర్ సభ్యుడైన జాన్ బరన్స్ సంవత్సరానికి 5,000 డాలర్లు చొప్పున తీసుకున్నాడు. ఇతడు హోమ్‌స్టెడ్ సమ్మె సమయంలో కార్నెగీని గట్టిగా ఎదిరించి నప్పటికీ ఇంగ్లండుకు ఇతడు గొప్ప సేవచేశాడని కార్నెగీ భావించాడు. కార్నెగీని బరన్స్ విమర్శనుంచి రక్షించిన థామస్ బర్టు అన్న మరొక సభ్యుడికి కూడా సంవత్సరానికి 5,000 డాలర్లు ఇవ్వటం జరిగింది.

కార్నెగీ తమకిచ్చిన భవనంలో న్యూయార్క ఇంజనీరింగ్ సంఘాలు అతని జ్ఞాపక చిహ్నంగా ఏర్పాటు చేసిన సభలో ఎలహూరూట్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: "అమెరికా దేశాభివృద్ధిని ప్రపంచాని కొక అద్భుత విజయముగా చేసిన జాతినిర్మాతల కోవకు చెందినవాడు కార్నెగీ. నే నెరిగినంతలో అంతటీ దయాళువు లేడు. ధనం అతని