పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నికి అనతిదూరంలో అతణ్ని జననం చేశారు. అతని సమాథిమీద స్కాచ్ దేశపు నీలశిల (Granite) తో చేసిన ఒక కెల్టిక్ క్రాస్ నిలచివుంది. స్కిబో ఎస్టేటులో సహచరులుగా వుంటున్న కార్మికులు ఆ గనుల్లో దానిని మలచి త్రోసికొని తెచ్చి పట్టామీదుగా రైలుమార్గం దగ్గరకి చేర్చారు. ఒక గ్లాస్గీ కళాకారుడు ఆ క్రాస్‌ను రూపొందించాడు. మిసెస్ కార్నెగీ దానిమీద చెక్కవలసిన మాటలను నిర్ణయించింది. అది అతి సర్వ సాధారణమైన వాఖ్యం. ఆడంబరం అణుమాత్రం లేనిది. అంతకంటే ఔచిత్యశోభితమైనది మరొకటి వుండే అవకాశం లేనిది.

ఆండ్రూ కార్నెగీ

జన్మ, డన్ఫ్‌ర్మ్‌లైన్, స్కాట్లండ్

25 నవంబరు 1835

మృతి, లెన్నాక్స్, మసాచ్యు సెట్సు

అంతే!

అతడు తన మరణ శాసనాన్ని స్వయంగా వ్రాసుకున్నాడు. భార్యకు కుమార్తెకు తగిన ఏర్పాట్లు చేశాడు. న్యూయార్క గృహంలోని సేవకులను, స్కిబో మిరాసిలోని సేవకులను, శ్రామికులను జ్ఞప్తి యుంచుకొని కొన్ని సంస్థలకు అథిపతులను చేశాడు. చివరకు మాజీ అధ్యక్షులను