పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గురించిన ఒడంబడిక ఏర్పడటమే. అటువంటిది జరుగుతుందా?"

పదకొండు నెలల తరువాత జులై 28, 1914 న ఆస్ట్రియా సెర్పియా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సంఘటనను గ్రహించటానికి కార్నెగీ మనస్సు ఎంతో కష్టపడింది. అతడు 1907 లో జర్మనీ అథినేత కైజరువిల్హెలమ్ II ను కలుసుకున్నాడు. అతని చిన్న ఓడలో ఆత డిచ్చిన విందు నారగించి నపు టతడు చేసిన ప్రసంగాన్ని బట్టి అతడు ప్రపంచశాంతికి, పురోభివృద్ధికి నిజంగా ఆతురత వహిస్తున్నాడని నమ్మి, అత డంటే మంచి గౌరవభావాన్ని కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ప్రధమ సంగ్రామ సమయంలో ఉక్కిరి బిక్కిరి అయినాడు. ధృడమైన నమ్మకం కలవాడు కాలేక పోయాడు. క్రమంగా మానవస్థితిని జూచి హృదయాంతరాళంలో దు:ఖాకులితు డౌతున్నాడు. భయానకత తీవ్రమై స్పష్టమైన రూపు రేకలతో సందర్శన మిచ్చినప్పుడు తాను శాంతి కోసం చేసిన కృషి, వెచ్చించిన ధనం వ్యర్ధమైపోయాయని గ్రహించాడు. శాంతియుతము, ఆనందమయము అయిన ప్రపంచాన్ని గురించి అతడు కన్న కలలన్ని భగ్నమైనాయి.

యుద్ధం ప్రారంభం కావటంవల్ల కార్నెగీ కుటుంబం వేసగికాలంలో స్కాట్లండులో ఎక్కువకాల ముండటం తగ్గించుకోవలసివచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళటంకోసం స్టీమరెక్కడానికి వారు వేగంగా లివర్ పూల్ చేరుకున్నారు.