పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షణమాత్రమైనా ఆమె వెనకాడలేదు. ఆమెతో సమానురాలు వెనుక పుట్ట లేదు, ఇక ముందు పుట్టబోదు అన్న అభిప్రాయాన్ని వెయ్యోమారు నిరూపిస్తూ ఆమె చిరునవ్వుతో "ఆండ్రీ! ఏమీ అనుకోము" అన్నది చిరునవ్వుతో.

బ్రిటిష కార్నెగీ ఫండు ఏర్పడ్డది.

కొన్ని సమయాలల్లో అతడు తన కార్యదర్శిని "పొయిస్టన్, ఇప్పటికి నే నెంత దానం చేసివుంటాను" అనేవాడు. అతడికి ఎప్పుడూ అంకెలు నాలుకచివరన సిద్ధంగా వుండేవి. అతడు సమాధానం చెప్పాడు: "ముప్ఫయి నాలుగు కోట్ల డెబ్బయి రెండు లక్షల ఎనబైఐదు వేల ఐదువందల డాలర్లు" (లేదా అప్పటికి ఎంత అయితే అంత)

"ఒహో!" అని సంతోషించేవాడు కార్నెగీ. "యీ డబ్బంతా నే నెలా సంపాదించాను" అనేవాడు.

ఆగష్టు 29, 1913 న హేగ్‌లోని శాంతి సౌధంలో నిలిచి అతడు తన అభిప్రాయాన్ని యిలా వెల్లడించాడు.

"ప్రపంచ శాంతిని నిలువబెట్టటానికి కావలసింది ప్రముఖమైన మూడు నాలుగు నాగరిక ప్రభుత్వాల మధ్య యింకా చేరదలచుకున్న వెన్ని వుంటే అన్నిటి మధ్య ఒక ఒడంబడిక - ప్రపంచ శాంతికి భంగాన్ని కల్పించేవారికి, లేదా వానికి యెదురు నిల్వటం విషయంలో ఒక సహాకారాన్ని