పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థానాలల్లోగాని తరుచుగా అపమార్గాన్ని పడుతుంది. ఎప్పుడో భవిష్యత్తులో ఆచరణలోకి రాబొయ్యేదాన్ని ఇప్పుడు మీరు మీ మరణశాసనంలో ఏర్పాటుచేసి వుంచటం యెంతో ప్రమాదకారి అయిన విషయం. శామ్యూయల్ జె. టిల్డన్ చేసిన పొరబాటు తిరిగి చెయ్యవద్దు యిప్పుడు మీ సంపత్తితో మీ రెలా చెయ్యాలని భావిస్తున్నారో అప్పుడు అతడలా చేశాడు. అది న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు వ్యతి రేకమైంది.

"మరణశాసనాలు అందమైనవేగాని అల్లట తల్లట కలిగించే వాహనాలు" అని, రూట్ ఇంకా ఇలా అన్నాడు. "జీవితకాలంలోనే ఈ నిధిని ఏర్పాటుచేసి, అందుకుగాను మీరు ఏర్పాటుచేసి వుంచిన సంపత్తిలో అధికాంశాన్ని దాని పరంచేసి ఆ వ్యవహారం మీరు సజీవులై వున్నప్పుడు కొంత నడుస్తుండటాన్ని ఎందుకు కల్పించగూడదు? అప్పుడు అది సక్రమంగా తరువాతి కాలంలో నడిచిపోతుందనే నిశ్చయం మీకు కలుగుతుంది. అంతేకాదు. మీరు ఉద్దేశించిన పనులను ఆచరలో ఆచరణలో పెట్టించిన ఆనందాన్ని మీరు పొందటం కూడా జరుగుతుంది"

అతడు రూట్ ఇచ్చిన సలహాను పాటించాడు. 1911 లో యునైటెడ్ స్టేట్సు స్టీల్ కార్పొరేషన్‌లోని 5% మొదటి రాబడినిచ్చే 2,50,00,000 (రెండు కోట్ల ఎభై లక్షల) డాలర్ల మూలధనంతో అతడు న్యూయార్క్ కార్నెగీ కార్పొరేషనును న్యూయార్క్‌లోని శాసన సభ చేత చట్టబద్దంచేయించి