పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థాపించాడు. ఇందుకు థర్మకర్తలుగా వ్యవహరించవలసిందని అతడు కోరిన ప్రముఖ వ్యక్తుల సంఘం నవంబరు 11 న కార్నెగీ గృహంలో సమావేశమైంది. అతడు వారికి తాను ఈ థర్మనిథిని స్థాపించటంలో ఉద్దేశమేమో తెలియ జేసే పత్రాన్ని యిలా చదివి వినిపించాడు. సాంకేతిక పాఠశాలలకు, ఉన్నత విద్యాసంస్థలకు, గ్రంథాలయాలకు, శాస్త్రీయ పరిశోధనకు, వీరనిథులకు, ప్రయోజనకరములైన ప్రచురణలకు వీటికిగాను కాలక్రమేణ ఏర్పడే ఇతర సంస్థలకు సాధనాలకు తోడ్పాటు నిచ్చి "విజ్ఞానాభివృద్ధి వ్యాప్తులను పెంపొందించటం, ప్రజలమధ్య సుహృద్భావాన్ని పోషించటం" ఈ నిధి లక్ష్యం.

ఈ నిధి అమెరికాలోని వైజ్ఞానిక సాంఘికాభి వృద్ధికి సంబంధించిన ఉద్యమాలకు తోడ్పడటమే కాకుండా అతడు నెలకొల్పిన ఇతర సంస్థలకు సహాయ మవసరమైనప్పుడు ధనసహాయం చేయటానికి కూడా ఉద్దేశింపబడ్డది. అతడు ఈ కార్పొరేషనును ఏర్పాటుచేసిన అనతి కాలంలో నే తొలుతటి మూలధనం చాలదని గుర్తించాడు. తా నుద్దేశించిన సర్వం ఆ చరణలోకి వస్తే చూడవలెనంటే ఇంకా ఎంతో అదనపు ధనం అవసరమని తోచింది. అయితే యిప్పుడు భార్యకు, కుమార్తెకు విడిచిపెట్టవలెనని ఉద్దేశించినది బాండ్ల రూపంలో గాని, ధనరూపంలోగాని వున్నది 12,50,00,000 (పన్నెండుకోట్ల యాభై లక్షల) డాలర్లు మాత్రమే. మరొక ఐదుకోట్లు లేదా పదికోట్లు డాలర్లు యివ్వటానికి వారు అంగీకరిస్తారా? క్షణమైనా వెనుదీయకుండా మిసెస్ కార్నెగీ అందుకు అంగీకరిం