పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంలో కార్నెగికి గల దృష్టి మహోదాత్తమైందని మోర్లీ అంగీకరించాడన్న మాట!

శాంతిని నెలకొల్పడానికి యత్నిస్తూన్నందుకు ప్రపంచంలోని వివిధ దేశాలూ కార్నెగీని గౌరవించాయి. ఫ్రెంచి ప్రభుత్వం అతణ్ని నైట్ కమాండ్ ఆఫ్ దిలీజియస్ ఆఫ్ ఆనర్ అన్న స్థాన మిచ్చి గౌరవించింది. హాలండ్ దేశం అతనికి "గ్రాండ్ క్రాస్ ఆర్‌డర్ ఆఫ్ ఆరంజ్-నాసౌ" బిరుదంతో సత్కరించింది. డెన్మార్క్ దేశం "గ్రాండ్ క్రాసు ఆర్డర్ ఆఫ్ డెన్నిబ్రాగ్ ఇచ్చి అతన్ని గౌరవించింది. ఇరవై ఒక్క అమెరికన్ రిపబ్లిక్కులు స్వర్ణపతాకాలను బహూకరించినవి. అసంఖ్యాకములయిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, అతనికి 'డాగ్ట రేట్‌' పట్టమిచ్చి గౌరవించాయి. నూట తొంబదికి పైగా సంస్థల్లోను, వైజ్ఞానిక సమాజాలల్లోను క్లబ్బులలోను, అతడు సభ్యుడుగా వ్యవహరించాడు.

తన మరణశాసనాన్ని (Will) వ్రాస్తూ అందులో అమెరికా ప్రజల ప్రయోజనంకోసం ఒక మహా పథకాన్ని అమలులో పెట్టేటందుకుగాను. బృహన్నిధి నొక దానిని ఏర్పాటుచేస్తున్నట్లు అందులో వ్రాస్తున్నాడు.

ఈ విధంగా అమెరికావాసుల కిస్తున్న అవకాశాన్ని గురించి అతడు ఎలిహూరూట్ తో చెప్పటం తటస్థించినప్పుడు అతడు తల పంకించి యిలా అన్నాడు.

"కొన్ని సంవత్సరాల క్రితం మీ రన్నది మీరే మరచిపోయినారా? అది కార్యాచరణలోగాని, న్యాయ