పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలియజేస్తుంది. "నేను యింతకంటే మంచి క్రిష్టమస్ బహుమానాన్ని పొందలేను." అన్నాడు లైయర్డ్. నేను జగత్తులోని బిరుదాలన్నిటిలోకి అత్యుత్తమమైన బిరుదునుపొందిన వాణ్ని. రాజా. అతడు కేవలం రాజుకుమాత్రమే. అతడికి మాల్కొంరాజు శిఖరం లేదు. సెయింటు మార్గరేటు ఆలయం లేదు. పిట్టెన్ క్రేస్ గ్లెన్ లేదు. అతడు ఏమీచూపలేడు నేను అతడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు యాత్రకు వస్తే నేను దిగివచ్చి ఉదాత్తదోరణిలో అతడికి ఇవన్నీ చూపెడతాను. ఇది నాకెంతో ఆనందప్రదమైంది.

ట్రస్టీలలో రాస్ ప్రథముడు కావటం తప్ప దు కదా! వారికి వ్రాసియిచ్చిన పత్రంలో కార్నెగి తన వుద్దేశాన్ని ఇలా వెల్లడించాడు. "డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో కష్టపడే శ్రామికజనుల విసుగుదలతో గూడిన జీవితానికి కొంత తీయదనాన్ని కొంత వెలుగును ఇవ్వటానికి ముఖ్యంగా యువకులకు ఇతర చోట్ల వసించేవారు పొందలేని కొంత తేజం, కొంత ఆనందం, కొంత ఉన్నతిని చేకూర్చేటందుకు, నా జన్మ స్థానంలో బిడ్డ తదనంతర కాలంలో తదనంతర జీవితంలో వెనుకకు చూచుకొని, ఇంటి దగ్గరనుంచీ ఎంత దూరం తిరిగినప్పటికీ కేవలం తాను అక్కడ ఉండటమే సుగుణంవల్ల జీవితాన్ని ఆనందప్రదంగాను ఉత్తమంగాను చేసుకొనేటట్లు కల్పింపబడ్డ దని భావించుకోటం కోసం" అనివ్రాశాడు.

ఆస్తిని పెంచి దాని నిత్య పాలన కోసం ఒక ఫండును ఏర్పాటు చేసేటందుకుగాను 25,00,000 (ఇరవయ్యైదులక్షల)