పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాలర్లు ఇచ్చి అతడు ట్రస్టీలను ఆశ్చర్యచకితులను చేశాడు. అతడు మరికొంత ఇచ్చిన తర్వాత ఆమొత్తం 37,50,000 (ముప్ఫయ్యేడు లక్షల యేభై వేల) డాలర్లు అయింది. ప్రజల ఆస్తి ఏదీ ఇంత జాగరూకతతో పాలింప బడ లేదు. ప్రజలకు ఏదీ ఇంత ప్రీతిపాత్రము కాలేదు.

విశ్వవిద్యాలయ ట్రస్టీగా ఉండటంచేత కార్నెగీ అక్కడ చదువు చెప్పేవారికి చాల తక్కువ జీతాలు ఇస్తున్నట్లు గమనించాడు. అతడు ఆతురతతో "ఇది అత్యుత్తమ వృత్తిగా పరిగణింపబడవలసింది అయినా అన్ని వృత్తులలోకి ఉపాద్యాయ వృత్తికి చాలా అన్యాయంగా, అవుట, నీచంగా ప్రతిఫలం ముడుతూంది. యువకులకు విద్య చెప్పటం కోసం జీవితాన్ని అంకితం చేసిన విద్యావంతులు మరీ అల్పభృతులను తీసుకొంటున్నారు. అందువల్ల అతడు ఏప్రియల్ 16, 1905 న విద్యాబోధనాభివృద్ధి కోసం అయిదు శాతంబాండ్లు రూపాన కోటి డాలర్లతో యునై టెడ్ స్టేట్స్ కెనడాల్లో వున్నతవిద్యకు దోహదమివ్వదలచి, విశ్వవిద్యాలయ కళాశాలలోపాథ్యాయులకు పింఛనుకు యేర్పాటుచేసి వారి విథనలకు పెన్షల్ల ఏర్పాటుతో కార్నెగి పౌండేషన్ ఏర్పాటు చేశాడు.

దాని ధర్మకర్తృత్వ సంఘంలో ఇరవై అయిదుమంది విశ్వవిద్యాలయాధ్యక్షులు, కళాశాలాధ్యక్షులు వున్నారు. వీరిలో చాలామంది అతనికి పూర్వమే మిత్రులైనవారు ఈ నిర్మాణసందర్భంలో వీరు కార్నెగీ గృహంలో సమావేశమై