పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/229

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూర్వం డన్ఫ్‌ర్మ్‌లైన్ వాడు) కల్నల్ హంట్ ఏజంట్లతో కదల్చమని మనం చెప్పవచ్చు ననుకొంటున్నాను" అన్నాడు.

"బాగుంది. నాకు ఇచ్చి వేయకపోవడంవల్ల తరువాత వారి యజమాని చింతపడవలసి వస్తుంది. దాన్ని కొనటానికి మరొక డెవ్వడూ అంత చులకనగా రాడు. నేను మనస్సును మార్చుకోటానికిగాని, మరణించటానికిగాని అవకాశముంది" అని వాళ్ళకు చెప్పండి అన్నాడు కార్నెగీ.

"ఆ విషయంలో ఎలా జాగ్రత్తపడాలో టాయ్‌షా బాగా ఎరిగినవాడు" అన్నాడు రాస్.

దీనితరువాత కొద్దికాలానికే కార్నెగీ న్యూయార్క్ వెళ్ళాడు.

కొన్ని వారాలు గడిచాయి. ఒకనాడు షా దగ్గర నుండి కేబిల్ వచ్చింది. "కల్నల్ హంట్ 45,000 పౌన్లకు ఒప్పుకుంటాడు. బేరం నిశ్చయించినా?"

"సరే. ఇది రాస్ పెట్టెషరతులన్నిటికీ అనుకూలంగా వుంటే అంగీకరించవచ్చు" అని సమాధాన మిచ్చాడు.

కొద్దిరోజులు గడిచాయి. మధ్యాహ్నం బాగా గడచిన తరువాత అది క్రిష్టమస్ సాయంత్రం. షా దగ్గరనుంచి మరొక కేబిల్ వచ్చింది. "హెయిల్, లైయర్డ్ ఆఫ్ పిట్టెన్ క్రీప్"

"పిట్టెన్ క్రీప్ ప్రభువుకు జయము!" ఇది ఒక కథను