పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీయరాదనీ ఆజ్ఞాపించాడు. ఈ మారిసన్ అన్న పేరుతో కార్నెగీకి ఒక వర్గం బంధువులుకూడా చేరుతారు అందువల్ల అంకుల్ లాడర్ డాడ్ నైగ్‌లను ఇద్దర్నీ ఒక ఆదివారం మధ్యాహ్న వేళ ఆగ్లెన్ అంచు చుట్టూ రా త్రిప్పి, దానిలోపలి భాగాన్ని చూడడానికి వీలయిన ఒక ఎత్తు ప్రదేశానికి తీసుకుపోయాడు.

కొంతకాలం డన్ఫ్‌ర్మ్‌లైన్ నివాసి, కార్నెగీ చేసిన కొన్ని ధర్మాలకు, యితరమయిన తన ఆస్తులకు అతని ప్రతినిధి - డాక్టర్ జాన్ రాస్ 1900 ప్రాంతంలో కార్నెగీలను చూడడానికివచ్చి, వారితో ఏకాంతంగా "కల్నల్ హంట్ డన్ఫ్‌ర్మ్‌లైనులోని తన ఆస్తులను అమ్మేసే సమయం వచ్చి నట్లు తెలిసింది" అన్నాడు.

"మంచిది" వాటిని నేను కొంటాను." అన్నాడు కార్నెగీ సంతోషంతో.

"అయితే, అతడు చెబుతున్న ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు తోస్తున్నది" అన్నాడు రాస్.

ఇరువురు ఈ విషయాన్ని గురించి మరి కొంతసేపు చర్చించారు. పరిస్థితిని కనిపెట్టడానికి డాక్టర్ రాస్ స్కాబ్ జాగరూకతతో వ్యవహరించాలని ఇరువురు నిశ్చయించారు. ఒక సంవత్సరంకాలం కాచుకున్న తరువాత డాక్టర్ రాస్ కార్నెగీ దగ్గరకి వచ్చాడు.

అతడు "ఎడింబరులోని మిష్టర్ షాతో, (ఇతడు