పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంఠంలో వినిపించే దే పవిత్రసంగీతం. 'క్రీస్తు వాద్య'పు ఈలలు అట్టివి కావని వా రన్నారు. దీన్ని గురించి ఎక్కువగా విన్న తరువాత కార్నెగీ స్కాట్లండుకు ఇలా వ్రాశాడు: "ఇది నన్ను చాలా బాధ పెట్టింది. ఇకముందు నేను చేయబోయే ఈ పాపానికి తోడుగా ఒక భాగస్వామి వుండాలి. ఇకనుంచి సమావేశాలను ఆర్గస్ ఖరీదులో సగ మిచ్చుకోమని కోరదలిచాను." ఇందువల్ల స్కాటిష్ పార్వ తేయుల్లో ఆర్గన్ వాద్యాల నిమ్మని కోరటం కొంత తగ్గింది.

కళాశాలలకు ఇచ్చే దానాలకు తాను గౌరవించే వాళ్ళ పేర్లుగాని, తన మిత్రుల పేర్లుగాని, స్మృతి పాత్రులైన వాళ్ళ పేర్లుగాని పెట్టటమంటే కార్నెగీకి ఇష్టం బ్రౌన్ యూనివర్సిటీలోని జాన్ హో గ్రంథాలయము, హామ్బిల్టన్ కాలేజీలో ఎలిహో పౌండేషను, వెష్టరన్ రిజర్వు యూనివర్సిటీలోని హెన్నాబైరు, వెలస్లీలోని ఫ్రాన్సిన్ క్లీన్‌లాండ్ లైబ్రరీ ఇందు కుదాహరణాలు.

ఓహెయోలోని కెన్‌యూస్ కాలేజీలో వున్న స్టాంటన్ భైర్ ఆఫ్ ఎకనమిక్స్, అధ్యక్షుడు లింకన్‌కు యుద్ధ కార్యదర్శి అయిన ఎడ్విన్ ఎం స్టాంటన్ పేర నెలకొల్పినది. ఇతడు మొదట, ముక్కోపి అని ఎక్కువమంది అభిప్రాయం: అయినా, ఉక్కు రాజు ఇతణ్ని పిట్స్‌బర్గులోని న్యాయవాదిగా జ్ఞప్తి కుంచుకున్నాడు. న్యాయవాదిగా వున్న ఆ రోజుల్లో ఇతడు ఆండ్రీ కార్నెగీ అన్న తంతి వార్తాహారి బాలుడితో ఎల్లప్పుడూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుండేవాడు.