పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడికి ఎక్కువ యిష్టమైన దానాలల్లో ఒకటి అతడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు ఫార్కు, దానిలోవున్న చారిత్రాత్మక భవనాలను ఇవ్వటం అక్కడివారు పార్క్ కావాలని బహుకాలం నుంచి వ్యామోహ పడుతున్నారు. కొన్ని తరాలుగా హంట్సు లైయర్డ్, పిటిన్ కీప్‌ల యాజమాన్యం క్రింద ఉంటున్న తమ ప్రాచీన వారసత్వాన్ని - పాత్ర అబ్బీ, దాని మైదానాలు, రాజభవన శిధిలాలు - తిరిగి పొందటంకోసం తమ గ్రామస్థులు చేసిన దీర్ఘ యుద్ధాలను గురించిన కధలు, వాళ్లకు పెద్దలు చెప్పగా విన్నవి. వాళ్ళు చెప్పటంవల్ల తాను విన్నవి ఆండ్రూకు బాల్యస్మృతుల్లోని అంశాలుగా మిగిలిపోయినవి. పిట్టెన్ కీఫ్‌గ్లెన్ ఆ తగాదాకు చెందిన భూ భాగంలో చేరిందే. ఇది నగరానికి సంబంధించిన రెండు ప్రధాన వీధులచే చుట్టబడింది. అరవై యెకరాలకు మించిన అందమైన రాతి ప్రదేశం. ఇందులో చిన్న అడవి వుంది. ఆండ్రూ చిన్నవాడు ఇది అతనికి ఎంతో అందంగా కనిపించేది. అతనికి దీనితో పోల్చదగ్గది ఒక స్వర్గం మాత్రమే అని అనిపించేది. అతడు అందులో ప్రవేశించటానికి ఆటంకం వుంది. కనుక అతడు దాన్ని బయట నిలబడి మాత్రమే చూడగలిగాడు. హంట్స్‌మీద జరిగిన పోరాటానికి అతని మాతామహుడు మారిసన్ నాయకుడు ఇతని మేనమామ బైలీ తరువాత నడచిన కొర్టే యుద్ధానికి నాయకుడు. అంతే కాదు. అతడు లై యర్డు కట్టిన కంచెలు బ్రద్దలుకొట్టడానికి గుంపును కూర్చినందుకు శిక్ష అనుభవించాడు కూడాను ఆ తరువాత లై యర్డుగ్లెన్ లోపలికి ఏ మారిసన్‌ను ప్రవేశింప