పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గురించి కేవలం బోధలు చేసేవాడు కాక కార్యరూపంలో చేసి చూపించాడనీ, అతనిపై జీవించిన అత్యుత్తమ మానవుల్లో అత డొకడని నిశ్చయంచేసుకొన్నాడు."

మొదటి హిరోఫండ్ కమీషన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూఫౌండులాండులకు మాత్రమే వర్తించింది. కానీ 1908 లో కార్నెగీ గ్రేట్ బ్రిటన్, ఐర్ లండులకు హిరోఫండును నెలకొల్పాడు. గ్రేట్ బ్రిటన్ పాలకుడు కింగ్ ఎడ్వర్డు VII జర్మన్ పాలకుడు కైజర్ విల్హెల్మ్ II ఉన్నత వర్గంవారు అతణ్ని మెచ్చుకుంటూ స్వయంగా లేఖలు వ్రాశారు.

కొన్ని సంవత్సరాలపాటు, మధ్య మధ్య ఘనదానాలతో, సంవత్సరానికి ఒక నిర్మాణాన్ని ఉద్దేశించి దానాలు చేశాడు. చర్చిపీస్ యూనియన్‌కు 20,00,000 (ఇరవై లక్షలు) డాలర్లకుమించి, హోగ్‌లో పీస్ పాలెస్ నిర్మాణానికి 15,00,000 (పదిహేను లక్షల) డాలర్ లు, ఇంటర్ నేషనల్ బోరో ఆఫ్ అమెరికన్ రిపబ్లిక్స్‌కు 8,50,000 (ఎనిమిదిన్నర లక్షల) డాలర్ లు ఇతనికి ఘనదానాలు. ఇవికాక చర్చి ఆర్గన్లు, గ్రంథాలయాలు, కళాశాల భవనాలు, లాబొరేటరీలు, ప్రొఫెసర్ షిప్పులు ఎన్నో దానం చేశాడు.

కరుడుగట్టిన పూర్వవాసన విశేషంగాగల హైలాండ్ స్కాచ్ ప్రెస్పిటీయన్లు చర్చీలలో సంగీతవాద్యాలుండటం మత విశ్వాసానికి విరుద్ధమని భావించేవాళ్లు. వీరు కార్నెగి చర్చలలో ఆర్గన్లను ప్రవేశపెట్టి క్రైస్తవ పూజావిధానానికి నైతికపతనాన్ని కల్పిస్తున్నాడని గొణిగారు. 'మానవ