పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరి మూడు క్రొత్త భవనాలు చేర్చబడ్డాయి. తరువాత మరొక ప్రత్యేక సంస్థ అయిన బ్రూకిలిన్ గ్రంథాలయానికి ఇరవై శాఖ లివ్వబడ్డాయి. ఈ గ్రంథాలయా లన్నింటికీ కొన్ని లక్షణా లుండాలి. ప్రతి ఒక్కదానికి రిఫరెన్స్ శాఖ, సంచారశాఖ వుండాలి. పిల్లల కక్ష్య. పత్రికల సంచికలు వుండాలి. బయటికి ప్రతి భవనం ఇది గ్రంథాలయమని ఎరుకపడే రూపంతో వుండాలి. అయితే వీటిలో ఒక్కటీ రెండో దాన్ని పోలివుండటానికి వీల్లేదు.

వీటిలో అనేక కట్టడాలలో అన్ని సౌకర్యాలు గల బేస్ మెంటు నాటక శాల లుండేవి. వీటిలో తరువాత కొన్ని సమయాలల్లో నాటక ప్రదర్శనలు జరిగేవి. తరువాత సంవత్సరాలల్లో వీటిమీద ఇంగ్లీషులోను ఇతర విషయాలల్లోను రాత్రి తరగతులు నడిచేవి. తరువాత కొన్ని సంవత్సరాలు ఒక లోకోపకారి అయిన న్యూయార్క్ నాటక ప్రదర్శకుడు జాన్ గోల్డెన్ లైబ్రరీ ధియేటర్ల పైనే పేరుపెట్టి కొన్ని నాటక సంస్థలను నడిపాడు. మంచి నటకులున్న సంఘాలకు ఉద్యోగా లిచ్చి నిలిపి ఈ లిటిల్ థియేటర్లుకు వెళ్ళి వీటిలో క్రొత్తగా బ్రాడ్వేలో ప్రదర్శించినట్టి నాటకాలను ప్రదర్శింప జేస్తుండే వాడు. ఈ నాటకాలు చూడటానికి, పరిమితమైన పట్టిలో స్థానాన్ని పొందిన, పోషకులకు ప్రవేశ రుసుం వుండేది కాదు.

1919 లో కార్నెగీ తన దాన ధర్మాలను పూర్తిగా నిలుపుదల చేసిన నాటికి 6,03,64,808 డాలర్లు ఖర్చుతో అతడు 2,811 స్వేచ్ఛా ప్రజా గ్రంథాలయ భవనాల ఏర్పా