పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టుకి దానం చేశాడు. వీటిలో 1946, సంయుక్త రాష్ట్రాలలోను, మిగిలినవి విదేశాలలోను ఉన్నవి. ఈ గ్రంథాలవల్ల ప్రయోజనం అనేక వేల మిలియన్ల మానవులకు అవి ఇచ్చిన అపరితమయిన విజ్ఞానానందాలు.

ఈ దాతే ఇలా చెప్పాడు: "గ్రంథాలయం ముఖ్యమైన ప్రయోజనం తా నివ్వ లేనివారికి అది ఏమీ ఇవ్వదు. యువకులు తమంత తామే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దీనిలోనుంచి తప్పించుకో పోవటమంటూ ఏమీ లేదు. ఇంకా అత డిలా అన్నాడు: "నేను నా చిన్ననాటి అనుభవాన్ని బట్టే తమలో మంచి ఉండి దాన్ని వృద్ధిపొందించుకునే శక్తి ఆసక్తి ఉన్న బాల బాలికలకు శ్రేయాన్ని చేకూర్చే గ్రంథాలయాలను, పురపాలక సంఘాన్ని ఎలాగో అలా, సాయపడి నిలుపుకోగల ఇచ్ఛ వున్న సమాజ మధ్యంలో వాటిని స్థాపించటంకంటే డబ్బును వినియోగించుకోటానికి మంచి మార్గం లేదని నిశ్చయించాను. స్థాపించిన గౌరవాన్ని నాకు దక్కించిన ఈ గ్రంథాలయాల భవిష్యత్తు ఈ అభిప్రాయం ఎంత సత్యమైందో నిరూపించి తీరుతుంది. ఎందువల్లనంటే ప్రతి గ్రంథాలయాల్లో ఒక్క వ్యక్తి అయినా దానిని ఉపయోగించుకొని కల్నన్ ఆండర్ సన్ నాలుగు వందల మాసి పోయిన సంపుటాల గ్రంథాలయంవల్ల నేను పొందిన లాభములో సగమైనా పొంద గలిగితే వీటిని స్థాపించటం వ్యర్ధంగా నేను భావిస్తున్నాను."