పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంపకం

13

న్యూయార్క్ ప్రజా గ్రంథాలయం డైరెక్టరు మిస్టర్ జె. యస్. బిల్లింగ్స్ మన్‌హట్టన్, బ్రాంక్స్ పేటల్లో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పే విషయంలో కొంతకాలంనుంచి కార్నెగీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. 1901 లో ఒక్కొక్క దానికి 80,000 డాలర్ల ఖర్చుతో అరవై అయిదు శాఖలను యేర్పాటు చేస్తానని సద్దు లేకుండా సూచన చేశాడు. ఇతర ఖర్చులు కాక ఇందుకయ్యే మొత్తం యాబై రెండు లక్షల డాలర్లు.

"యాబైరెండు లక్షలు పెద్ద ఆర్డరు!" అన్నాడు. కార్నెగీ. కాని "ఈ భవనాలు అవసరమని తోస్తే తప్పక కట్టితీరవలసిందే" అందువల్ల నగరం తగిన నివేశన స్థలాలను వెదకటం ఆరంభించింది. డబ్బు లేకపోవటంవల్ల చాలా పర్యాయాలు ఆగటంవంటి సాధారణ ప్రతిబంధకాలు లేమీ లేకుండా డబ్బు ఇవ్వటానికి పారిశ్రామిక అల్లాడీస్ ఉండటం వల్ల పని వేగంగా జరిగింది. అయితే కావలసిన డబ్బు అంత మొత్తమే కాదు. ఇంకా మొదట అంచనాను అతిక్రమించి