పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన 40,00,00,000 నలబైకోట్ల డాలర్ల ధనాన్ని దానం చెయ్యటం ప్రారంభించిన సరసమై దయాన్వితమైన గుండ్రని మోము, తెల్లని గడ్డము గల ఈ కురుచై లావైన చిన్న మనిషి, అతని గడ్డమే మరికొంత నిడివిగలదైన దైతే శాంతాక్లాస్‌కు ఆదర్శమయిన ప్రతిమూర్తిని వహించిన ట్లుండేవాడు. అయితే ప్రతిఫల రహితంగా అతడు సహాయంచేసిన వేలకొలది పాఠాశాలలకు కళాశాలలకు, ధర్మసంఘాలకు వ్యక్తులకు అతడు ఇప్పుడే శాంతా క్లాస్.

అసంఖ్యాకంగా శాఖలను నిర్మించే విషయంలో అతడు ఇప్పుడుకూడా న్యూయార్క్ ప్రజాగ్రంథాలయ ధర్మకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. తొలుతగా మిలియను డాలర్లు ఇచ్చి ఇంతకు పూర్వపు సంవత్సరం పిట్స్‌బర్గులో కార్నెగీ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభం చేశాడు. తరువాత తరువాత అతడు తన జీవిత కాలంలో ధర్మాలుగా యిచ్చిన మొత్తం 1,60,00,000 (ఒక కోటి అరవై లక్షల) డాలర్ల అయినది. స్కెలెన్ల పార్క్‌లో అతడు కట్టించి ఘన నిర్మాణానికి నాలుగు శాఖలున్నవి - స్కూల్ ఆఫ్ అప్లయిడ్ సైన్సు, స్కూల్ ఆఫ్ అప్లయిడ్ డిజైను, స్కూల్ ఆఫ్ అప్లయిడ్ ఇండస్ట్రీస్, మార్గరెట్ మారిసన్ కార్నెగీ స్కూలు, ఇవన్నీ యువతులకు గృహ శాస్త్రంలోను, దానికి సంబంధించిన అనుబంధ విషయాలల్లోను శిక్ష రాయిచ్చే సంస్థలు. ఇవన్నీ ఆ యా శాస్త్రాలల్లో పట్టభద్ర బిరుదా లిచ్చేవే.

వ్యాపారంనుంచి విరమించుకొన్న తరువాత కార్నెగీ