పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అతి కఠిన శిలవంటి మోర్గన్ ముఖంలో అణుమాత్రమైనా మార్పు కనిపించ లేదు. "అది తృప్తికరంగానే వున్నది" అన్నాడు. మరికొంతసేపు మాట్లాడి, బండియెక్కి వాల్‌స్ట్రీట్‌కు వెళ్ళిపోయినాడు. "అడిగినట్లయితే ఆయన కింకో పదికోట్ల డాలర్లు ఎక్కువ ఇచ్చివుండేవాణ్ని" అని తరువాత మోర్గన్ స్క్వాబ్‌తో అన్నాడు.

కనుక మోర్గన్ 110,00,00,000 (నూట పదికోట్లు) డాలర్ల కాపిటల్ షేర్లతో యునైటెడ్ స్టేట్స్ కార్పొరేషన్ అన్న మహాసంస్థను నిర్మించాడు. ఇరవై అయిదు సంవత్సరాలకు పూర్వం పదిహేను పదహారు సంవత్సరాల వయసులో పెన్సిల్వేనియా కొండల్లో బండి తోలి బ్రతికిన కుర్రవాడయిన స్క్వాబ్ దీని కధ్యక్షుడు. ఈ వ్యాపారాన్ని ఇంతకంటే అధిక శక్తి మంతుడయిన వ్యక్తి చేతుల్లో పెట్టేందుకు అవకాశం లేదని చార్లీ పూర్వ యజమాని అంగీకారపూర్వకంగా భావించాడు.

వ్యాపారాన్ని విడిచిపెట్టటంవల్ల కలిగిన క్రుంగుబాటు తలపు కార్నెగీలో ఎక్కువ కాలం నిలువలేదు. తరువాత వెంటనే అతడు తాను చేయిదలచుకున్న పనులను గురించి ఆలోచన ప్రారంభించాడు. చార్లీ చెప్పినమాట సత్యం. తన ధనా న్నంటినీ దానం చెయ్యటంవల్ల అతడెంతో ఆనందాన్ని అనుభవించబోతున్నాడు. అతని వయ సిప్పుడు అరవై ఆరు సంవత్సరాలు. ఇక యెక్కువ కాలం మిగిలివుండక పోవచ్చు.

దానం చెయ్యటంలో వెనుకంజ లేనిమాట నిజం.