పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసిన మొదటి పనులలో ఒకటి, ఉక్కు కర్మాగారాలు కొలుముల్లో పనిచేసిన వారి సంక్షేమంకోసం 50,00,000 (యాభై లక్షల) డాలర్‌లు ప్రత్యేకించి వుంచటం అతడు ఇందులో ఒక మిలియను డాలర్ లు తాను వారికోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయ పాలనకోసం వేరుగా పెట్టి వుంచాడు. మిగిలిన ధనమంతా వయోవృద్ధుల పింఛనులకోసం కర్మాగారంలో వికలాంగులయిన వారికి సహాయ మివ్వడం కోసం మృతినొందిన కార్మికుల కుటుంబాలకు సహాయ మివ్వటంకోసం వుద్దేశింపబడింది.

ఆ సంవత్సరం వసంతంలో నాలుగు స్కాబ్ విద్యాలయాలలోను అతిప్రాచీనమై ప్రబల ప్రతిష్టను గడించుకొన్న సెయింటు ఆండ్రూస్‌కు లార్డు రెక్టరుగా నియమితుడు కావటం కోసం స్కాట్లండు వెళ్లాడు. విశ్వవిద్యాలయాలలో లార్డు రెక్టర్ ఒకప్పుడు ప్రముఖోద్యోగిగా వుండేవాడు. ఐతే శతాబ్దులు గడచిన తరువాత అది ఒక గౌరవ పదవిగామారి పోయింది. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎన్నుకొన్న ఒక ప్రముఖవ్యక్తి ఆ పదవిని స్వీకరిస్తుండేవాడు. సెయింటు ఆండ్రూస్ చరిత్రలో గడిచిన అయిదు శతాబ్దాలలో ఈ పదవిని నిర్వహించిన విశిష్టవ్యక్తులు సుదీర్ఘ పట్టికలో తాను ఒకడుగా వుండే అవకాశమిచ్చిన ఈ గౌరవానికి కార్నెగీ గర్వించటం ఎంతో సమంజసం. ఈ ఎన్నుకో బడటం విషయంలో ఇతడు బ్రిటిష్ పౌరులు కాని వారిలో ప్రధముడు, తరువాత 1902 లో కూడా విద్యార్థులు అతణ్ని మరోమారు