పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు వెంటనే అంగీకరించాడు.

"ఈ విషయంలో నా దొక నియమ ముంది" అన్నది ఆమె.

"యేమిటది?"

"అది స్కాట్లండు పర్వత ప్రాంతంలోనే ఉండాలి.

ఆమె అతనికి అంతకంటే సంతోషాన్ని కలిగించే మరొకదాన్ని దేన్నీ సూచించలేదు. ఎలా వున్నప్పటికీ వారు ఇక క్లనీ కాజిల్ ను వేసవి గృహంగా పొందలేరు. మాక్పర్ సన్ వివాహం చేసుకుంటున్నాడు. ఇక ఆ గృహం అతని ఉపయోగంకోసం అతని కే అవసరం పది వేసగి సమయాలు కార్నెగీలు అక్కడ నివసించటం వల్ల వారితో అతనికి సన్నిహిత మైత్రి ఏర్పడింది. బిడ్డ కలిగిన వెంటనే వారు అతనికి కేబిల్చి తెలియజేశారు. అతడు ఆ సంతోష వార్తవిని అతడు తన మెక్ఫర్ సన్ ప్రాంతంలో గొప్ప ఉత్సవం చేయించాడు. తొమ్మిది కొండలమీద మంటలు వేయడం, విందులు జరపటం, కార్నెగీల ఆరోగ్యంకోసం మథుపానాలు చెయ్యటం ఆ ఉత్సవంలోని విశేషాలు.

అందువల్ల నూతన పిత అద్దెకుగాను క్రొత్త మిరాసీని (Manor) వెదకకుండా స్వంత ఆస్తినే కొనటానికి యత్నిస్తున్నాడు. డ్యూక్ ఆఫ్ సథర్ లాండ్‌కు స్కివో అనే పేరుతో ఉత్తరస్కాచ్ పర్వతప్రదేశంలో ఒక ఎస్టేటు ఉన్నదనీ, అతడు దాన్ని అమ్మదలుచుకున్నాడనీ అతడు తెలుసుకున్నాడు. అడవులు, సుందరమైన నిమ్లోన్నతాలు ప్రీతికరమైన