పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాహ్యాళిస్థలాలు, ఆరోహణాలు, మంచి మత్స్య సంపద గల సరస్సులు, విశ్వసించదగిన సమస్థితి గల వాతావరణం. జనవరిలో వికసించే పుష్పకుంజాలు అన్నీ దానికి వున్నట్లు అతడు తెలుసుకున్నాడు. ఆ ఆస్తికి వున్న వాటన్నిటిలో అత్యుత్తమమైంది ఉన్న శిలా ప్రదేశం పై నిల్చి నదీ సాగరసంగమం వంకకు తిలకిస్తూ ఉన్న గొప్ప ప్రాచీన శిలాసౌధం చూచిన వెంటనే కార్నెగీకి ప్రీతి కలిగింది. అతడు దాన్ని కొన్నాడు. కొన్ని మార్పులు కూర్పులు చేసి క్రొత్తరూప మిచ్చాడు. ఎలివేటర్‌ను ఏర్పాటు చేయించాడు. విద్యుద్దీపాలను పెట్టించాడు. ఆధునికమైన 'ప్లంబింగ్‌'ను పెట్టించాడు. టర్కిష్ స్నాన శాలలను నిర్మించాడు. అందులో మేలుజాతి పశువులు గల 'సానిటరీ డైరీ'ని నెలకొల్పాడు. అందలి పూద్రోటలు అమిత ఖ్యాతి వహించాయి.

అ సౌధం కార్నెగీల ఇంటికి ఎందరు అతిథులు వచ్చినా ఒక్కమాటుగానే ఆతిథ్య మివ్వటానికి తగినంత విశాలంగా వుంది. అతిథుల అసంఖ్యాకంగా వస్తుండేవారు. వయోవృద్ధులైన మిత్రులు గ్లాడ్‌ష్టన్, మేథ్యూ అర్నాల్డుల వంటివారు వెళ్ళిపోయినారు. తరువాత తరంవా రైన రుడ్డి యర్డు కిప్లింగ్, పాడెరివిస్కీ, సర్ ఎడ్వర్డు గ్రే, స్కాబ్ ఉక్కు నిర్మాత సర్ ఛార్లెస్ టెన్నెంట్, ఇలిహూరూట్, ఉన్నత వర్గం వారైన ఇంకా ఇతరులు అతిథులుగా వస్తుండేవారు. వారి పూర్వ మిత్రులు లార్డు, లేడీ మోర్లేలు ఋతువుకు రెండు మార్లో మూడు మార్లో వచ్చి వెళ్లుతుండేవారు. స్కిబోకు పదిమైళ్ళ దూరాన వున్న రైలు స్టేషను దగ్గిర