పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తులమీద సమర్థులని తోచిన యువకులను భాగస్తులనుగా తీసుకోవటం యింకా అతడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఇంతవరకూ అటువంటివాళ్ళు ముప్పదిమంది దాకా ఐనారు. వీళ్ళలో ప్రతి ఒక్కరికీ అనంతసంఖ్యలో 'స్టాప్‌' ఉంది. ఇలాంటి వాళ్ళల్లో ఒకడయిన ఒక స్కాబ్ యువకుణ్ణి భాగస్వామిగా గ్రహింపబోయేముందు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ అతడు "పీ కాక్, నిన్నొక మిలియనీరును చేస్తే నా కే మిస్తావు" అన్నాడు కార్నెగీ. ఆ డబ్బుకు తగ్గట్లు ధారాళమైన డిస్కౌంటు ఇస్తానని వెంటనే ఆ యువకుడు చమత్కారంగా సమాధానం చెప్పాడు. అది ఆ ప్రముఖ వ్యాపారిని విశేషంగా గిలిగింత పెట్టింది.

మార్చి 30, 1897 నాడు కార్నెగీకి ఒక కుమార్తె కలిగింది. ఈ బిడ్డ చాలా అందమైంది. ఈ మె తరువాత అతనికి మరెవ్వరూ బిడ్డలు కలుగ లేదు. తన ఏకైక సంతానమైన ఈ బిడ్డను అతడు తొలిసారిగా చూచినప్పుడు భార్య అతనితో అన్నది. "ఈ బిడ్డ పేరు మార్గరెట్. మీ తల్లిగారి పేరు ఆమె జ్ఞాపకార్ధం ఈ పేరు పెట్టుకుందాము. నాదో చిన్న అభ్యర్ధన."

"లౌ. ఏమిటది?" అని అడిగా డతడు.

"మనకు పరమేశ్వరు డిచ్చాడు. గనుక మన కొక వేసగి గృహమంటూ ఉండాలి. ప్రతిసారి మరొకరి ఇల్లును అద్దెకు పుచ్చుకొంటూ, ఒక తేదీనాటి కందులో ప్రవేశించటం, మరొక తేదీనాటికి ఖాళీ చెయ్యటం మనం చెయ్యలేము. అది ఇక మన ఇల్లే ఐ ఉండాలి."