పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాన్ని సాధించదలచుకొన్నారు గనుక" అని న్యూయార్క్ న్యూస్ పేపర్ విలేకరులతో ఒప్పుకున్నాడు.

కొన్ని సంవత్సరాలయిన తరువాత కార్నెగీ ఈ విషయాన్ని గురించి తన ఆత్మకథలో ఇలా వ్రాసుకొన్నాడు: "నాజీవితంలో ఇంతకు పూర్వంగాని, తరువాతగాని ఎన్నడూ ఇటువంటి సమస్యను ఎదుర్కొనవలసి రాలేదు. ఏదీ యింత తీవ్రంగా నన్ను వ్యథ పెట్టనూ లేదు. ఈ హోమ్‌స్టెడ్ వ్యవహారంలో తప్ప నా వ్యాపారిత జీవితంలో నే పొందిన మరొక గాయమేదీ లేదు."

ఆకురాలే కాలం రాగానే అతడు అమెరికాకు వచ్చినప్పుడు కర్మాగారానికి వెళ్ళి ఆ కొట్లాటలో పాల్గొనని కొందరు వృద్ధులతో మాట్లాడాడు. "మీరు ఇక్కడ ఉన్నట్లయితే సమ్మె వచ్చేదేకా"దని వా రతనికి సమాధానం చెప్పారు. కర్మాగారం యిచ్చిన 'నజరు' చాలా సముచితంగా వుందిగదా!" అని అతడన్నప్పుడు ఆ వృద్దుల్లో ఒకడు "మిష్టర్ కార్నెగీ! ఇది డాలర్లకు సంబంధించినది కాదు. ఆ పిల్లలను నీవు తన్నినా ఒప్పుకుంటారు, కానీ ఇంకొకడు జుత్తుమీద చెయ్యి వేసి తట్టినా ఊరుకోరు"

ఏమైనా అమెరికాలో అనేకమంది ఈ ప్రమాదాన్ని గురించి విన్న వెంటనే అతడు తిరిగి రాకపోవటం పిరికితనాన్ని ప్రదర్శించటమని అనుకొన్నారు. అతణ్ణి విమర్శించే స్వభావం గలవాళ్లు తరువాత చాలకాలం వరకూ ఇలాగే అతనికి వ్యతిరేకంగా అంటూ వచ్చారు. తనకు ప్రియమైన షర