పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చిన ఆవ్యక్తి కార్నెగీని చూడగానే నవ్వాడు. "నేను అధ్యక్షుడి దగ్గరనుంచి ఇప్పుడే వస్తున్నాను" అని అతడు "ఆయన చీలీ విషయంలో నిన్ననీతో దీర్ఘమైన సంభాషణ చేశానని ఆవిషయాన్ని గురించి నీవు ఆయనమీద విరుచుకు పడేటందుకు వచ్చావనీ అన్నాడు. శాంతినిగురించి కార్నెగీ అతి తీవ్రంగా భావిస్తాడు అని నే న్నాను. అతడు మీతో అంతగట్టిగా మాట్లాడితే నాతో ఎలా మాట్లాడుతాడో వినాలని ఉంది, నాతో మాట్లాడినట్లుగా మీతో అతడు అంత స్వేచ్ఛగా మాట్లాడడు. మాట్లాడినప్పుడు కొంత దాచుకొన్నట్లు మాటాడివుంటా డనుకొంటాను అన్నాను. అధ్యక్షుడు "అతనిదగ్గర దాచుకోటమన్న ఆగుణం అణుమాత్రమైనా నాకేమీ కనిపించ లేదని చెప్పాడు" అన్నాడు.

ఆ తరువాత బ్లెయిన్ ఎల్కిన్స్‌లు ఇద్దరూ హృదయ పూర్వకంగా నవ్వుకున్నారు.

మరునాటి సాయంత్రం భోజనం దగ్గిర ఈ విషయం చర్చకు వచ్చింది. అయితే చర్చ ఎంతో మృదువుగా నడిచింది. అధ్యక్షుడి ఉద్రేకం కొంతగా చల్లబడుతున్నట్లు కార్నెగీ గమనించాడు. కార్యనిర్వాహకవర్గంవారు కూడా అధ్యక్షుడికి అనుకూలంగా లేనట్లు అతనికి అర్ధమైంది.

"ఈ విషయాన్ని తెచ్చినందుకు క్షమించండి మిష్టర్ ప్రసిడెంట్. మీరు బాగా అలసిపోయినట్లున్నారు. మీకు మంచి మంచి విశ్రాంతి అవసర మనిపిస్తున్నది. మీరు